శ్రీరెడ్డి పోరాటంకి స్పందించిన తెలంగాణ ప్రభుత్వం  

శ్రీరెడ్డి పోరాటానికి స్పందించిన తెలంగాణ సర్కార్. .

Telangana Government Pass The Bill To The Opponent Panel For Casting Couch-srireddy,telangana Government Pass The Bill,telugu Cinema,tollywood

ఆ మధ్య టాలీవుడ్ లో నటి శ్రీ రెడ్డి ఇష్యూ ఎంత సంచలనం అయ్యిందో అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో ప్రముఖులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి మీడియా ముందుకి వచ్చిన శ్రీ రెడ్డికి మహిళా సంఘాల నుంచి కూడా మద్దతు లభించింది. అయితే తరువాత ఆ శ్రీ రెడ్డి ఇష్యూ రాజకీయ రంగు పులుముకోవడంతో మహిళా సంఘాలు, అలాగే ఆమెకి అండగా నిలబడ్డ జూనియర్ ఆర్టిస్ట్స్ అందరూ వెనక్కి తగ్గిపోయారు..

శ్రీరెడ్డి పోరాటంకి స్పందించిన తెలంగాణ ప్రభుత్వం-Telangana Government Pass The Bill To The Opponent Panel For Casting Couch

అయితే మహిళా సంఘాలు మాత్రలు టాలీవుడ్ లో లైంగిక వేదింపుల ఘటనలు జరగకుండా విమెన్ ప్యానల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేయడంతో పాటు పిటీషన్ కూడా వేసారు. అప్పట్లో శ్రీరెడ్డికి మద్దతుగా మహిళా సంఘాలు వేసిన పిటిషన్ ను ఇన్నాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం పరిగణంలోకి తీసుకుంది. టాలీవుడ్ లో మహిళల రక్షణ కోసం ప్యానెల్ ఏర్పాటు చేస్తూ జీవో నంబర్ విడుదల చేసింది.

ఈ ప్యానెల్లో సినీ నటి సుప్రియ, నటి, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందినిరెడ్డిని టాలీవుడ్ ప్రతినిధులుగా నియమించింది. అలాగే నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయలక్ష్మితో కమిటీ ఏర్పాటు చేసింది.