'ఖేలో ఇండియా' సెంటర్ల నిర్వహణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్న తెలంగాణ సర్కార్...!

సీనియర్ క్రీడాకారులకు శుభవార్త.ఆటలపైన ఆసక్తి ఉండి, ఏదో ఒక గేమ్ లో నేషనల్ స్థాయిలో ఆడినవారికి SAT (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ), SAI (స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) మంచి అవకాశం కల్పిస్తోంది.

 Khelo India Invites Applications , Centers, Sports, Senior Players, Registration-TeluguStop.com

స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆదేశాల మేరకు హైదరాబాద్‌ జిల్లాలో మూడు ఖేలో ఇండియా సెంటర్ల నిర్వహణకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఈ మేరకు జిల్లా యువజన క్రీడలశాఖ ఛైర్ పర్సన్‌ శ్వేతా మహంతి ఒక ప్రకటనలో తెలిపారు.

ముఖ్యంగా వివిధ రకాల క్రీడలైన బాక్సింగ్‌, బ్యాడ్మింటన్‌, షూటింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌, స్లైక్లింగ్‌, ఫెన్సెన్గ్‌, ఆర్చరీ, జూడో, రోయింగ్‌, ఫుట్‌బాల్‌, హాకీ మొదలగు స్పోర్ట్స్ నుంచి ఖేలో ఇండియా సెంటర్ల నిర్వహణకు కేవలం 3 క్రీడలను ఎంపిక చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.ఆయా సెంటర్లు నిర్వహించడానికి సీనియర్ క్రీడాకారుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు.

ఇకపోతే ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి.

నలభై ఏళ్ల లోపు వయసు ఉన్న సీనియర్‌ క్రీడాకారులు మాత్రమే అర్హులు.5 ఏళ్లుగా ఆయా సెంటర్లను నిర్వహిస్తున్న అనుభవం కలిగి ఉండాలి.వ్యక్తిగత అంశాల్లో, టీం క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొని ఉండాలి.

సీనియర్‌ నేషనల్స్ ‌తో పాటుగా ఖేలో ఇండియా పోటీల్లో మెడల్‌ విన్నర్‌ సాధించి ఉండాలి.ఆలిండియా యూనివర్సిటీ మెడల్‌ విన్నర్‌, సీనియర్‌ నేషనల్‌ ఫాస్ట్‌ చాంపియన్స్ ‌లో పాల్గొని ఉండాలి.

సెప్టెంబర్ 7 లోగా దరఖాస్తు చేసుకోవాలి.పైన పేర్కొన్న అంశాల్లో ఏ ఒక్క పోటీల్లో పాల్గొన్నా సెంటర్ల నిర్వహణకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తును www.kheloindia.gov.in వెబ్ ‌సైట్‌ నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకోవాలి.

పూర్తి చేసిన దరఖాస్తును కలెక్టరేట్ ‌లోని జిల్లా యువజన, క్రీడల అధికారి కార్యాలయంలో అందజేయాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube