పోడు రైతులను నట్టేట ముంచిన తెలంగాణ సర్కార్?

ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావంతో బతుకులు బాగుపడతాయని… పోరాటాలతో సాధించిన తెలంగాణలో పోడుభూములకు పట్టాలు వస్తాయని ఆశించిన తమ ఆశలను తెలంగాణ సర్కార్ నట్టేట ముంచిందని ఆదీవాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పోడు భూములను అటవీ భూములుగా చూపెడుతున్న తెలంగాణ సర్కార్… అటవీ అధికారులను ఉసిగొల్పుతూ ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపిస్తున్నారు.

 Telangana Government Immersed In Planting Podu Farmers Telangana Government , Tr-TeluguStop.com

అధికార పార్టీ నాయకులు పోడు రైతులకు మద్దతు తెలుపుతున్నామంటున్నా… ఆచరణలో మాత్రం వారికి చిత్తశుద్ధి లోపించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత నాలుగేళ్లలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లావ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఓ చోట పోడుభూముల సమస్యలు వెలుగుచూస్తూ… తమకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని ఆదీవాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మంచిర్యాల, కుమురంబీంఆసిఫాబాద్ జిల్లాల్లో వర్షకాలం వచ్చిందంటే… పోడు వ్యవసాయం సాగు ఆదివాసీ గిరిజన గుండెల్లో గుబులు రేపుతోంది.ఇటీవల మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడెంలో ఆదివాసీల భూముల్లో అటవీ అధికారులు జేసీబీలు పెట్టి కందకాలు తవ్వుతున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.

Telugu Adilabad, Forest, Formmers, Frest Officers, Telangana, Trs, Ts Poltics-Po

పంట వేసిన భూముల్లో ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా… పోడు భూముల పేరుతో కల్టివేషన్ చేస్తూ మొక్కలు నాటుతున్నారు.అధికారుల చర్యలను పోడు రైతులు అడ్డుకోవడంతో పలు మండలాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి.కాగజ్నగర్ మండలంలోని కడంబ గ్రామం సహా సిర్పూర్ నియోజక వర్గంలోని పలు గ్రామాల్లో గ్రామస్థులు, ఫారెస్ట్ అధికారుల మధ్య పోడు భూముల పోరు కొనసాగుతోంది.2005 కంటే ముందు సాగులో ఉన్న వారికి 10 ఎకరాలకు మించకుండా అటవీ హక్కు పత్రాలు ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 66 వేల మంది పోడుభూముల హక్కు పత్రాలకు దరఖాస్తులు చేసుకున్నారు.వీటిపై ఎటూ తేలకపోవడం… ప్రభుత్వ నిర్ణయం మధ్యలో ఆగిపోవడమే.సమస్యలకు ప్రధాన కారణమవుతోంది.2018లో సీఎం కేసీఆర్ కుర్చీ వేసుకొని కూర్చుని పోడు రైతులకి పట్టాలు ఇస్తాను అంటూ కాగజ్నగర్లో మోసపూరితమైన హామీలు ఇచ్చి గాలికి వదిలేశారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పోడు రైతులకు మద్దతు తెలుపుతున్నామంటూ అధికార పార్టీ నేతలు రోడ్డెక్కి రాస్తారోకోలు చేస్తున్నా… సమస్య పరిష్కారంలో, ఆచరణలో మాత్రం వారికి చిత్తశుద్ధి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube