కరోనా విషయంలో రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!!

నిన్న మొన్నటి వరకూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా చికిత్స విషయంలో ప్రజలే డబ్బులు చెల్లించేలా పరిస్థితులు ఉండేవి.ఇదే గ్రామంలో పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ కరోనా నీ ఆరోగ్య శ్రీ లో చేర్చడం జరిగింది.

 Telangana Government Has Good News For The People Of The State Regarding Corona-TeluguStop.com

ఈ క్రమంలో తెలంగాణ లో అధికారంలో ఉన్న కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విపక్షాల నుండి ప్రజల నుండి కరోనా చికిత్స విషయంలో ఆరోగ్య శ్రీ లో చేర్చకపోవడం పై విమర్శలు వచ్చాయి.పరిస్థితి ఇలా ఉండగా తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా చికిత్స ను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం తో కలిసి కరోనా చికిత్స విషయంలో అడుగులు వేస్తూ ఉంది.విషయంలోకి వెళితే కరోనా చికిత్స విషయంలో కేంద్రం ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ లో చేర్చడం జరిగింది.

ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఆరోగ్యశ్రీలో కి కరోనా ట్రీట్మెంట్ తీసుకురావడంతో.తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్పే రిట ఈ పథకం అమలు కానుంది.

గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కరోనా బారిన పడిన క్రమంలో చికిత్స విషయంలో వేలకొలది డబ్బులు ప్రభుత్వ ఆసుపత్రులకు చెల్లించి.చాలా నష్టపోవడం జరిగింది.కొంతమంది ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి అప్పట్లో ఏర్పడింది.కాగా ఇండియాలో మరికొద్ది నెలల్లో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలసి ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత విభాగంలో కరోనా చికిత్స నీ చేర్చటం నిజంగా తెలంగాణ ప్రజలకు ఇది గుడ్ న్యూస్ అని చాలామంది అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube