రైతులకు కేసీఆర్ శుభవార్త... రుణమాఫీ అమలు ఎప్పుడంటే

తెలంగాణ సీఎం కేసీఆర్ రైతులకు శుభవార్త చెప్పారు.ఈ నెలాఖరు నుండి తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటన చేశారు.

 Telangana Government Good News To Farmers-TeluguStop.com

ఈరోజు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యాయి.ప్రభుత్వం దీనికి సంబంధించిన జీవోను జారీ చేసింది.

ప్రభుత్వం రుణమాఫీ అమలు దిశగా చర్యలు చేపట్టటంపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం రాష్ట్రంలో లక్ష రూపాయల లోపు రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేయనుంది.25 వేల రూపాయల లోపు రుణాలను తొలి దశలోనే మాఫీ చేయనుంది.ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకానికి 2014 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2018 డిసెంబర్ 11 లోపు రుణాలు తీసుకున్న రైతులు అర్హులవుతారు.

వ్యవసాయ శాఖ గ్రామాల వారీగా, బ్యాంకుల వారీగా రుణమాఫీకి అర్హులైన రైతులకు సంబంధించిన వివరాలను సేకరిస్తోంది.

ప్రభుత్వం చెక్కుల ద్వారా రుణమాఫీ మొత్తాన్ని రైతులకు అందజేయనుంది.

ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు రుణమాఫీ చెక్కులను రైతులకు అందజేయనున్నారు.కుటుంబంలో ఎంతమంది రుణాలు తీసుకున్నా ఒక్కరు మాత్రమే ఈ పథకానికి అర్హులవుతారు.

ఐటీ పోర్టల్ ద్వారా వ్యవసాయ శాఖ డేటా సేకరించనుంది.రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube