తెలంగాణ ప్ర‌భుత్వం ఉచిత స‌ర్జ‌రీ పధకం.. వాటికి మాత్రమే.. !

దుబ్బాక ఎలక్షన్ దెబ్బతో తెలంగాణ ప్రభుత్వం కళ్లు తెరచుకున్నట్లుగా ఉన్నాయి.అందుకే అప్పటి నుండి తెలంగాణ ఓటర్లను ఆకర్షించే పనిలో గులాభి బాస్ బిజీగా ఉన్నట్లు కనిపిస్తుందట.

 Telangana Government Free Surgery Scheme, Telangana Govt, Free Surgery, Organ Tr-TeluguStop.com

ఇకపోతే హైద‌రాబాద్‌లోని ప్ర‌ధాన‌ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో అవ‌య‌వ దానానికి కావాల్సిన ఏర్పాట్లు చేసేందుకు ముంద‌డుగు వేస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వం.మరో విప్లవాత్మక నిర్ణయానికి తెరతీసింది.

ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ పథకం కింద మూత్రపిండాలు, గుండె, కాలేయ మార్పిడి చికిత్సలను చేర్చి రూ.30 లక్షలు ఖర్చయ్యే అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ఉచితంగా అందజేయాలని నిర్ణయించింది.రాష్ట్రంలో క్రమక్రమంగా కొవిడ్ కేసులు త‌గ్గుముఖం పడుతున్న నేపధ్యంలో ప్ర‌భుత్వ ఆస్పత్రుల్లో అవ‌య‌వ దాన మార్పిడికి సంబంధించిన చ‌ర్య‌ల‌పై దృష్టి సారించింది.

కాగా ఇటీవ‌లే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్, అవ‌య‌వ మార్పిడి శ‌స్ర‌చికిత్స‌లపై సీనియ‌ర్ వైద్యాధికారుల‌తో ఏర్పాటు చేసిన స‌మావేశంలో గాంధీ ఆస్ప‌త్రి ఎనిమిదో అంత‌స్తులో రూ.35 కోట్ల‌తో చేప‌ట్ట‌బోయే ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ఏర్పాట్ల‌పై చ‌ర్చించారు.అయితే ఇదే గనుక అమలైతే ఎందరో పేదవారికి ఆసరగా ఈ వైద్యం ఉంటుందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube