లాక్ డౌన్ పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం.. !

తెలంగాణ ప్రజలకు ఊహించని వార్త.కరోనా తీవ్ర విజృంభన నేపధ్యం లో రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

 Telangana Government Extends Lockdown-TeluguStop.com

అయితే ఈ పది రోజుల తర్వాత పరిస్దితి ఎంటనే ప్రశ్న చాలా మంది మనస్సులో పుట్టి ఉంటుంది.ఇప్పటికే ఈ లాక్‌డౌన్ ఈనెల చివరి వరకు ఉంటుందని జోస్యాలు కూడా చెప్పారు.

మరి కొందరు మాత్రం తెలంగాణలో కరోనా తగ్గు ముఖం పడుతుంది కాబట్టి కఠిన ఆంక్షలు అమలు చేస్తారు కానీ లాక్‌డౌన్ విధించరని ఊహించుకున్నారు.

 Telangana Government Extends Lockdown-లాక్ డౌన్ పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ పొడిగించడమే మేలని రాష్ట్ర క్యాబినెట్ అభిప్రాయపడిందట.

దీంతో ఈ నెల 30 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.ఇకపోతే ఎప్పటి లాగానే ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రం ప్రజలు తమ అవసరాల నిమిత్తం బయటకు రావచ్చని, ఆ తర్వాత అనవసరంగా రోడ్ల మీద కనిపిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని పేర్కొన్నారు.

#Telangana Govt #Lockdown #LockdownIn #Corona #COVID-19

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు