ఆన్ లైన్ లో అర్చన... లాక్ డౌన్ వేళ హిందువులకి ప్రత్యేకం

ప్రతి హిందువు పవిత్ర పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకోవాలని అక్కడ అర్చన నిర్వహించాలని, అలాగే ఆలయాలలో జరిగే వేడుకలో పాల్గొనాలని అనుకుంటాడు.అయితే కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ తో ఆలయాల దర్శనాలు పూర్తిగా నిలిచిపోయాయి.

 Telangana Government Started Archana In Online,  Lock Down, Hindu Temples-TeluguStop.com

నిత్య హారతి, పూజలు జరుగుతున్నా దర్శనాలు మాత్రం లేవు.ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల, కాశి లాంటి వాటికి కూడా దర్శనాలు పూర్తిగా నిలిపేశారు.

అయితే దర్శనాలు నిలిపేయడంతో దైవ భక్తులు చాలా మంది నిరుత్సాహ పడుతున్నారు.వారిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం ఆన్ లైన్ లో అర్చన ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

దీనికోసం ఒక ప్రత్యేకమైన యాప్ ని రూపొందించి గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంచింది.

తొలి దశలో సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి దేవాలయం, కర్మన్‌ఘాట్‌లోని ధ్యానాంజనేయస్వామి ఆలయంలో ఆన్ లైన్ పూజలు ప్రయోగాత్మకంగా ప్రారంభం కానున్నాయి.

ప్లే స్టోర్ నుంచి టీఎస్ యాప్ ఫోలియోను డౌన్ లోడ్ చేసుకొని అందులో ఆలయాల వివరాలు చూసి, మనకి కావాల్సిన ఆర్జిత సేవను ఓపెన్ చేసి, వివరాలు నమోదు చేసుకుంటే భక్తులు కోరిన రోజున ఆ పూజలు నిర్వహిస్తారు.పూజల తరువాత అక్షింతలు, పసుపు కుంకుమ, డ్రైఫ్రూట్స్ తో కూడిన ప్రసాదాన్ని పంపించాలని భావించిన ప్రస్తుతానికి ఇది సాధ్యపడదు కాబట్టి ప్రస్తుతానికి అక్షితలు పంపించాలని నిర్ణయించారు.

భద్రాద్రి రామయ్య కల్యాణాన్ని తిలకించలేకపోయినా, కల్యాణ తలంబ్రాలను ఈ యాప్ ద్వారా పొందవచ్చు.మరి ఆన్ లైన్ అర్చన సేవలని ఎంత మంది ఉపయోగించుకుంటారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube