మాస్క్ లేకుంటే 1000 జరిమానా.. అధికారిక ఉత్తర్వులు జారీ..! - Telangana Government 1000 Fine For Not Wearing Mask

Telangana Government 1000 Fine for Not Wearing Mask , 1000 Fine, Corona Effect , COVID-19, Not Wearin,g Mask, Telangana Government, Telangana state - Telugu 1000 Fine, Corona Effect, Covid-19, Not Wearing Mask, Telangana Government, Telangana State

తెలంగాణాలో కరోనా విజృంభిస్తుంది.రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నాయి.

 Telangana Government 1000 Fine For Not Wearing Mask-TeluguStop.com

తెలంగాణా రాష్ట్రంలో గత 24 గంటల్లో 3184 కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్టు తెలుస్తుంది.అందుకే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ యాక్షన్ లోకి దిగింది.

కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంతో మాస్క్ ను కచ్చితంగా ధరించాలని రూల్ పెట్టింది.మాస్క్ ధరించకుండా వస్తే వారికి 1000 రూపాయల ఫైన్ ఆదేశిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

 Telangana Government 1000 Fine For Not Wearing Mask-మాస్క్ లేకుంటే 1000 జరిమానా.. అధికారిక ఉత్తర్వులు జారీ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలంగాణాలో అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులను పంపించారట.బహిరంగ ప్రదేశాలు, ప్రయాణాల్లో, వర్క్ చేస్తున్న ఏరియాల్లో కూడా మాస్క్ కంపల్సరీ అంటున్నారు.

రాష్ట్రంలో మాస్క్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు పోలీస్ అధికారులు.మాస్క్ ధరించని షాపు యజమానులకు కౌన్సెలింగ్ ఇస్తూ.మార్క్ ధరించని వారి వివరాలు, ఫోటోలు సేకరిస్తున్నారు.అంతేకాదు మొదటిసారి మాస్క్ లేకుంటే ఫైన్ తో వదిలేసినా మరోసారి అలా చేస్తే షాప్ సీజ్ చేస్తామనిం హచ్చరిస్తున్నారు.

పదిరోజుల క్రితమే ఈ మాస్క్ డ్రైవ్ మొదలవగా షాపు యజమానుల్లో మరింత నిర్లక్ష్యం కనిపిస్తుంది.కరోనా కేసులు పెరుగుతున్న ఈ నేపథ్యంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ప్రజలు అప్రమత్తగా ఉండాలని చెబుతున్నారు.

మాస్క్ ధరించకుండా కనిపిస్తే 1000 రూపాయలు జరిమానా తప్పనిసరి చేశారు.  ప్రజల్లో చైతన్య తెచ్చేందుకే ఈ మాస్క్ డ్రైవ్ ఏర్పాటు చేశారు.1000 ఫైన్ కు భయపడి అయినా మాస్క్ ధరిస్తారని ప్రభుత్వ ఆలోచన అని చెప్పొచ్చు.

#COVID-19 #1000 Fine #Corona Effect #Telangana State

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు