కరోనా : తప్పుడు రిపోర్ట్‌లతో ఇద్దరు గాంధీ డాక్టర్ల సస్పెండ్‌

చైనాలో ఉన్న కరోనా వైరస్‌ వేలాది మందిని చంపేస్తుంది.ఇప్పటికే దాదాపుగా 30 దేశాలకు ఈ వైరస్‌ పాకినట్లుగా ప్రచారం జరుగుతోంది.

 Telangana Governament Serious On Gandhi Hospitals Doctors-TeluguStop.com

ఇప్పటికే ఇండియాలో కేరళలో కరోనా వైరస్‌ లక్షణాలతో రోగులు బయట పడ్డ విషయం తెల్సిందే.ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా భయపడుతుండగా హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో కరోనా లక్షణాలున్న రోగులు జాయిన్‌ అయ్యారంటూ వైధ్యులు బయటకు చెప్పడం.

వారి బ్లడ్‌ శాంపిల్స్‌ను పరీక్షించిన తర్వాత వారికి కరోనా వైరస్‌ ఎటాక్‌ అయినట్లుగా వారు ప్రకటించారు.

ఆ రోగులకు కరోనా లేకున్నా కూడా వైధ్యులు కరోనా ఉన్నట్లుగా ప్రచారం చేయడంతో పాటు రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులకు కారణం అయ్యారు అంటూ గాంధీ వైధ్యులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది.

వారిని ఉద్యోగం నుండి తొలగించడంతో పాటు మళ్లీ అలాంటి అసత్య ప్రచారాు చేయవద్దంటూ డాక్టర్లను హెచ్చరించింది.ప్రభుత్వం కరోనా వ్యాప్తి చెందకుండా పూర్తి భద్రత పరమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా ఈ సందర్బంగా తెలంగాణ ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube