కరోనాతో పేరెంట్స్ ని కోల్పోయి అనాధలైన పిల్లల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా భారీగా మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే.రెండోసారి వచ్చిన ఈ మహమ్మారి వల్ల ప్రపంచంలో అన్ని దేశాల్లో కల్లా ఎక్కువగా నష్టం వాటిల్లింది ఇండియాలోనే.

 Telangana Governament Help Orphaned Children Who Have Lost Their Parents To Coro-TeluguStop.com

అంత దారుణంగా పరిస్థితులు భారతదేశంలో నెలకొన్నాయి.ఇలాంటి తరుణంలో చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయి దిక్కుతోచని విధంగా బతుకులు తలకిందులు అయిపోయాయి.

దీంతో అటువంటి  పిల్లల విషయంలో దేశంలో మొట్టమొదటిసారి స్పందించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కరోనా తో తల్లీతండ్రులను కోల్పోయినా  వారికి పది లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ఫిక్సిడ్ డిపాజిట్ వేసి వారిని ఆదుకునే కార్యక్రమం స్టార్ట్ చేయగా ఆ తర్వాత కేరళ ముఖ్యమంత్రి కూడా ఇదే తరహాలో స్పందించారు.

Telugu Corona Orphans, Telangana-Telugu Political News

తర్వాత కేంద్రం కూడా రంగంలోకి దిగి వారికి అనేక రాయితీలు కల్పిస్తూ భరోసా ఇవ్వడం జరిగింది.ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన పిల్లలను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.మేటర్ లోకి వెళ్తే అనాధ అయిన పిల్లలకు భద్రత కల్పించడానికి వారికి స్మార్ట్ ఫోన్ లు ఇవ్వాలని.రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.ఈ బాధ్యతను మహిళా శిశు సంక్షేమ శాఖ కు రాష్ట్ర ప్రభుత్వం అందించింది.ఈ స్మార్ట్ ఫోన్ లలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లతో పాటు హెల్ప్ లైన్ అదేవిధంగా ఎమర్జెన్సీ నెంబర్లను కాంటాక్ట్ జాబితాలో ఫీడ్ చేసి అనాధ పిల్లలకు అండగా నిలవటానికి తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube