మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న క్రమంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడానికి అందరూ ప్లాన్ లు వేసుకుంటున్నారు.ఇటువంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం మందు బాబులకు గుడ్ న్యూస్ తెలిపింది.
విషయంలోకి వెళితే న్యూ ఇయర్ నాడు డిసెంబర్ 31 వ తారీకు అర్ధ రాత్రి 12 వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అంతమాత్రమే కాకుండా డిసెంబర్ 31వ 12:00 తర్వాత రోజు జనవరి 1వ తారీఖు.ఉదయం ఒంటి గంట వరకు ఈవెంట్లు కూడా జరుపుకోవచ్చు అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలియజేశారు.ఈ మేరకు అనుమతి ఇస్తూ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది.
మద్యం విషయంలో మాములు రోజుల కంటే న్యూ ఇయర్ నాడు భారీగా విక్రయం అవుతుంటుంది.దీంతో “న్యూ ఇయర్” పురస్కరించుకొని ఆ రోజు మందు ద్వారా వచ్చే ఆదాయం పై దృష్టి సారించినట్లు… తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బట్టి తెలుస్తోంది.
మరోపక్క.పక్క తెలుగు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ కూడా ఇదే రీతిలో ఆలోచన చేస్తున్నట్లు న్యూ ఇయర్ వేడుకలకి ఆంక్షలు లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.