ఉద్యోగ సంఘాలన్ని టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకం

హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల్లో సిట్టింగ్‌ స్థానంను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.అది కాకుండా టీపీసీసీ రాజీనామా చేసిన సీటు అవ్వడం, ఆయన సొంత నియోజక వర్గం అవ్వడంతో ఆ స్థానం కాంగ్రెస్‌ పార్టీకి చాలా ప్రతిష్టాత్మకంగా మారింది.

 Telangana Employement Are Opposition In Trs Governament-TeluguStop.com

కాంగ్రెస్‌ చీప్‌ ఉత్తమ్‌ భార్య పద్మావతి అక్కడ పోటీ చేస్తుంది.కాంగ్రెస్‌ కు పలు పార్టీలు మరియు ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి.

టీఆర్‌ఎస్‌ తరపున సైదిరెడ్డి పోటీ చేస్తున్నాడు.అయితే టీఆర్‌ఎస్‌ కు కూడా మొదట గెలుపు అవకాశాలు చాలానే ఉన్నాయి.

ప్రస్తుత పరిస్థితి మారింది.టీఎస్‌ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న కారణంగా వారిని సస్పెండ్‌ చేస్తున్నట్లుగా ప్రకటించడం, దాంతో ఇద్దరు కార్మికులు చనిపోవడం వంటి కారణాల వల్ల టీఆర్‌ఎస్‌ పై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది.

ఇక అన్ని ఉద్యోగ సంఘాలు కూడా టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి.కాంగ్రెస్‌కు ఓట్లు వేసే అవకాశం ఉంది.రెండు పార్టీల క్యాండేట్స్‌ కూడా హోరా హోరీగా పోటీ పడతారని భావిస్తే ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా కాంగ్రెస్‌ వైపు విజయం మొగ్గుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.అయితే ఫలితం అనేది జూదం లాంటిది చివరి వరకు తారు మారు అయ్యే అవకాశాలు ఉంటాయి.

చివరి రోజు మొత్తం మారిపోయే అవకాశం ఉంది అంటూ మరికొందరు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube