నన్ను క్షమించండి : తెలంగాణ ఈసీ రజత్ కుమార్  

తెలంగాణాలో పోలింగ్ విజయవంతంగా పూర్తయినా… అనేక మంది ఓట్లు మాయమవ్వడంపై ఈసీకి వేలాదిగా ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ సమస్యపై స్పందించిన ఈసీ రజత్ కుమార్ ఓటర్లకు క్షమాపణలు చెప్పారు. తమ ఓట్లు గల్లంతయ్యాయని…చాలా మంది స్వయంగా తనకు ఫోన్ చేశారని చెప్పిన ఆయన, ఓటర్లకు క్షమాపణలు చెప్పారు.

Telangana Electoral Officer Rajat Kumar  Apologized To The Voters-

Telangana Electoral Officer Rajat Kumar, Apologized To The Voters

మూడేళ్ల క్రితం జరిగిన ఐఆర్ఈఆర్ లో పొరపాట్లు జరిగాయని, అప్పట్లో నిబంధనలు పాటించకుండా ఓట్లను తొలగించడంతోనే ఈ సమస్య వచ్చిందని అన్నారు. జాబితాలో ఓట్లు ఉన్నాయో లేదో చూసుకోవాలని ప్రచారం చేశామని గుర్తు చేసిన ఆయన, రెండు నెలల్లో 25 లక్షల మంది కొత్త ఓటర్లను చేర్చామని అన్నారు. ఓట్లను కోల్పోయిన వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని, 26 నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఉంటుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను లోక్ సభ ఎన్నికల్లో జరుగకుండా చూస్తామని అయన వివరణ ఇచ్చారు. .