ఆపండి ఆపండి : నాలుగు తరువాత మూగబోనున్న మైకులు     2018-12-04   22:55:10  IST  Sai M

ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంతో చెవులు చిల్లులు పడేలా హోరెత్తిన మైకుల సౌండ్ ఇక మూగబోయే సమయం వచ్చేసింది. పోలింగ్ తేదీ అతి దగ్గరకు వచ్చెయ్యడంతో… బుధవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి పుల్‌స్టాప్ పడనుంది. అన్ని నియోజకవర్గాల్లో బుధవారం సాయంత్రం నుంచి బహిరంగ సభలు నిషేధం. 13 నియోజకవర్గాల్లో బుధవారం సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగియనుంది.

Telangana Electoral Commission Limits On Election Campaign-

సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాలలో సాయంత్రం నాలుగు గంటల నుంచే నిషేధం అమల్లోకి రానున్నట్టు తెలంగాణ ఎన్నికల అధికారి రజత్‌కుమార్ తెలిపారు. నిబంధనలను జిల్లా ఎన్నికల అధికారులు కచ్చితంగా అమలు చేయాలి. పోలింగ్ జరిగే ప్రాంతంలో వినోద కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల వరకు జైలు శిక్షకు గురికావాల్సిందే అని రజత్ హెచ్చరించారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.