ఫేక్ సర్వేలతో షేక్ అవుతున్న పార్టీలు !

పల్లె .పట్టణం అనే తేడా లేకుండా ఇప్పుడు తెలంగాణాలో వాతావరణం బాగా వేడెక్కిపోయింది.

 Telangana Elections Fake Survey-TeluguStop.com

చలికాలం లో వేడి ఏంటి అనే కదా మీ డౌట్ అదేనండి … ఎన్నికల వేడి.ఊరూవాడా … మైకుల హోరుతో…వాతావరణం వేడెక్కిస్తూ… పార్టీలు ప్రచారంలో ములిగిపోయాయి.

ఎక్కడా లేని హామీలు ఇస్తూ… మీకు అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ఓటర్లను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు.ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి మరోసారి అధికారం దక్కకుండా.

ఆ పార్టీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి.అంతేకాదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ… ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చే భారీ బహిరంగ సభ పెట్టించి మరీ టీఆర్ఎస్ ను తిట్టించడంతో పాటు తెలంగాణాలో సెంటిమెంట్ రగల్చగలిగింది.

ఈ రాజకీయ సందడి ఇలా ఉండగానే… ఇప్పుడు తెలంగాణాలో సందట్లో సడేమియాలా … అనేక సర్వే సంస్థలు హడావుడి మొదలుపెట్టేశాయి.ఈ పార్టీ గెలవబోతుంది .ఆ పార్టీ గెలవబోతుంది అంటూ… సీట్ల లెక్కలతో సహా వివరాలు చెప్పేస్తున్నాయి.ఇందులో ఉన్న మతలబు ఏంటి అంటే… ఏ పార్టీకి ఆ పార్టీ సొంతంగా సర్వేలు చేయించుకుంటూ… తమకే అనుకూలంగా ఉంది అంటూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి.

ఏ సర్వే ఫలితాలను నమ్మాలో .ఇందులో ఎంత వరకు నిజం ఉంది ఎంతవరకు అబద్దం అనేది మాత్రం ఎవరికీ అంతు పట్టడంలేదు.

ఇటీవల తెలంగాణాలో కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంది అంటూ సర్వే ఫలితాలను వెల్లడించిన లండన్ కి చెందిన కేంబ్రిడ్జి అనలైటిక అనే ఒక పెద్ద పొలిటికల్ సర్వే సంస్థ ఈ ఎతుగడ ను బ్రేక్సిట్ మరియు ట్రంప్ ఎలక్షన్ కోసం బాగా వాడింది.ఈ సర్వేల ఉదేశ్యం ఇంకా ఎవరికీ వోట్ చెయ్యాలో డిసైడ్ కానీ వాళ్ళని మరియు న్యూట్రల్ ఓటర్లను బాగా ప్రభావితం చేస్తాయని ఒక నమ్మకం.కానీ ఇక్కడ సర్వే లలో కాంగ్రెస్ కి అనుకూలంగా… ఇచ్చారు సరే , చాలా స్థానాలలో రెండో స్థానం ఎవరు వస్తారో చూస్తే ఈ సర్వే లు ఎంత మోసమొ తెలిసి పోతుంది.ఫస్ట్ , సెకండ్ , థర్డ్ లో వచ్చే వారికీ ఓట్ల శాతం మధ్య వ్యత్యాసం ఎంతో తెలియకుండానే సర్వే ఫలితాలు విడుదల చేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube