ఎగ్జిట్ పోల్స్: మళ్లీ గులాబీ పార్టీదే హవా !

తెలంగాణాలో పోలింగ్ ముగిసింది.ఇక ఏ పార్టీ గెలవబోతోంది అనే విషయంలో అందరికి ఆసక్తితో కూడిన టెన్షన్ మొదలయ్యింది 11 వ తేదీ నాటికి కానీ ఎన్నికల ఫలితాలు వెలువడవు.

కానీ ఈ సమయంలోనే ఈ పోలింగ్ సరళిని బట్టి ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతోంది అనే విషయం పై రకరకాల సంస్థలు ముందస్తుగా ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టాయి.

రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీయే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.టీఆర్ఎస్‌కు 50 – 65 సీట్లు వస్తాయని.ప్రజాకూటమికి 38-52 స్థానాలు, బీజేపీకి 4-7, ఇతరులు 10 – 17 స్థానాల్లో గెలవనున్నారని ఎగ్జిపోల్స్ ఫలితాలు చెబుతున్నాయి.తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.62 శాతానికి పైగా పోలింగ్ జరిగింది.

టైమ్స్ నౌ – సియెన్ఎక్స్ సర్వేలోనో… టీఆర్ఎస్ విజయం సాధిస్తుంది అనే ప్రకటించాయి.ఈ ఎగ్జిట్స్ పోల్ ప్రకారం టీఆర్ఎస్ – 66 , ప్రజకూటమి – 37 , బీజేపీ 07 , ఇతరులు – 09 వస్తాయని ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube