తెలంగాణ బీజేపీ అభ్యర్థుల లిస్ట్ వచ్చేస్తోంది     2018-10-19   14:46:54  IST  Sai Mallula

ఎన్నికలకు తెలంగాణ బిజెపి కసరత్తు ముమ్మరం చేసింది. రేపు అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో తయారీపై పూర్తిగా సిద్ధమైనట్లు సమాచారం. రెండు రోజుల పాటు వరుసగా ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ కూడా సమావేశమైంది. ఈ కమిటీలో దాదాపు 10 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా కలిసి మొదటి విడత అభ్యర్థుల జాబితాను తయారు చేసే అవకాశముంది. ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఢిల్లీకి పంపనున్నారు. దీన్ని బిజెపి అధిష్టానం పరిశీలించి రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఢిల్లీలో అమిత్‌ షా సమక్షంలో పరిపూర్ణానంద బిజెపి లో చేరబోతున్నారు.

Telangana Elections Bjp Candidates List Ready-

Telangana Elections Bjp Candidates List Ready