కేసీఆర్ 'ముహూర్తం' బాలేదా ..? ఈ దుర్ముహూర్తాలు ఏంటి..?

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది.జ్యోతీష్యం .

 Telangana Election Date And Result Is Lucky To Kcr1-TeluguStop.com

ముహూర్తాల సెంటిమెంట్ బాగా నమ్మే కేసీఆర్ వాటి ప్రకారమే అన్ని కార్యక్రమాలు చేస్తుంటారు.ముందస్తు ఎన్నికలకు వెళ్లడం .అసెంబ్లీని రద్దు చేయడం.పార్టీ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించడం ఇలా ఏది చేసినా.

అవన్నీ జ్యోతిష్యం .ముహూర్తం ని బట్టే.కానీ ఇప్పుడు ఎన్నికల తేదీ, కౌంటింగ్ కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్నాయా.? ముహూర్తాలు, సెంటిమెంట్లను నమ్మే వారికి పోలింగ్‌ తేదీ అంత అనుకూలంగా లేదని పండితులు చెబుతున్నారు.పోలింగ్ జరిగే డిసెంబర్ 7వ తేదీ అమావాస్య కావడమే దానికి కారణం.

ఓట్ల లెక్కింపు జరిగే డిసెంబరు 11 కూడా చవితి.ముహూర్తాలు, సెంటిమెంట్లను బలంగా విశ్వసించే కేసీఆర్‌ మంచి ముహూర్తం చూసుకునే అసెంబ్లీని రద్దు చేశారు.తన లక్కీ నంబరు 6న శ్రావణ మాసం, గురువారం మధ్యాహ్నం ద్వాదశి ఘడియల్లో పుష్యమి నక్షత్రం ప్రవేశించిన తర్వాత గురు పుష్య యోగంలో అసెంబ్లీ రద్దుకు తీర్మానం చేశారు.

కేబినెట్‌ భేటీ, గవర్నర్‌తో సమావేశం, 105 మంది అభ్యర్థుల ప్రకటనలు.అంతా ముహూర్తాల ప్రకారమే చేశారు.ఈ నేపథ్యంలో పోలింగ్‌, కౌంటింగ్‌ తేదీలు కూడా కేసీఆర్‌ జాతకానికి అనుగుణంగానే వస్తాయా? అని చర్చ జరిగింది.కానీ ఈసీ ప్రకటనతో అది కాస్తా రివర్స్ అయ్యింది.

ఎన్నికల షెడ్యుల్‌ ప్రకటించిన కొద్ది సేపటికే కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ మధుయాష్కీ మొదటగా తేదీలపై స్పందించారు.ఏ రకంగా చూసినా కేసీఆర్‌కు ఎన్నికల షెడ్యుల్‌ కీడు చేస్తుందన్నారు.

ఇంతకు ముందు నవంబర్ ఇరవై నాలుగున పోలింగ్ జరుగుతుందని.మీడియాలో లీకులొచ్చాయి.

కానీ తర్వాత ఏమయిందో కానీ.తెలంగాణ పోలింగ్‌ తేదీని అమావాస్య అయిన డిసెంబరు 7న; కౌంటింగ్‌ను చవితి అయిన 11గా నిర్ణయించారు.

అయితే కొంత మంది పండితులు మాత్రం మరో లెక్క తీస్తున్నారు.పోలింగ్‌ రోజున జ్యేష్ఠ నక్షత్రం ఉందని, అది కేసీఆర్‌ కు జన్మతార అవుతుందంటున్నారు.

ఓట్ల లెక్కింపు జరిగే 11న ఉత్తరాషాఢ నక్షత్రం ఉందని, అది కేసీఆర్‌కు క్షేమతార అవుతుందని, ఇది ఆయనకు కలిసొచ్చే విషయమని రకరకాల వాదనలు వినిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube