వారెవ్వా ! నాయకుల 'చిత్ర' విచిత్రాలు చూడండయ్యా !     2018-10-26   22:22:22  IST  Sai Mallula

తెలంగాణాలో ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతో నాయకులూ ప్రచారానికి దిగిపోయారు. మారు మూల పల్లెలకు కూడా వెళ్ళిపోయి .. వరసలు కలిపేస్తూ … దండాలు పెట్టేస్తున్నారు. అంతేనా … జనాలు సీరియస్ గా ఏదైనా పనిలో నిమగ్నం అయితే… వీరు కూడా ఆ పని చేసేస్తూ .. ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగానే…

Telangana Election Campaining Diffrent Veriyations On Leders-

Telangana Election Campaining Diffrent Veriyations On Leders

మహబూబ్‌నగర్‌లోని అప్పన్నపల్లిలో ఓ ఇంటి ముందు మహిళ బియ్యం కడుగుతుండగా.. అటుగా ప్రచారానికి వచ్చిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌ గౌడ్‌ చూశారు. అంతే.. వెంటనే ఆమె వద్ద గిన్నె తీసుకుని స్వయంగా బియ్యం కడిగారు. అక్కడే ఓ వృద్ధుడు ఉప్మా తింటుండగా ప్లేటు తీసుకుని తానే తినిపించారు. ఓ కొత్త ఇంటి వద్ద పునాది తవ్వారు.. తాపీ పట్టి సిమెంటు కూడా వేశారు. ఇలా అన్ని పనులు చేసేస్తూ … వారిని ఆకట్టుకున్నారు. ఆ ఎన్నికల తంతు కాస్తా పూర్తయిపోతే ఇక కంటికి కనిపిస్తారా ఈ నాయకులు ..?