కేజీ నుండి పీజీ వరకు అన్నీ ఆన్ లైన్ తరగతులే..!

తెలంగాణాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో నెల పాటు పెట్టిన లాక్ డౌన్ ను కూడా ఎత్తేశారు.ఇక జూలై 1 నుండి తెలంగాణాలో విద్యాసంస్థలు తెరచుకుంటున్నాయి.

 Telangana Educational Minister Sabitha Indra Reddy Clarifies Online Teaching, Cl-TeluguStop.com

ఈ క్రమంలో బోధన విధానంపై రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వివరణ ఇచ్చారు.కరోనా నేపథ్యంలో కేజీ నుండి పీజీ వరకు అన్ని ఆన్ లైన్ క్లాసులే జరుగుతాయని చెప్పారు.

జూలై 1 నుండి ఆన్ లైన్ తరగుతులు స్టార్ట్ చేయొచ్చని అన్నారు.టీ శాట్ ద్వారా ఆన్ లైన్ విద్యా బోధన జరుగుతుందని చెప్పారు.

జరగాల్సిన డిగ్రీ, పీజీ, డిప్లొమా పరీక్షలు యథాతథంగా జరుగుతాయని అన్నారు.కామన్ ఎంట్రన్స్ టెస్టుల తేడీల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవని వెల్లడించారు.ఇక విద్యార్ధుల ఫీజుల విషయంలో ఒత్తిడి చేయొద్ధని.ఫీజుల విషయంలో జీవో నెంబర్ 46ని అనుసరించాలని చెప్పారు.

నెలవారీగా ట్యూషన్ ఫీజును మాత్రమే తీసుకోవాలని అన్నారు.లాస్ట్ ఇయర్ లానే ఈ ఏడాది కూడా కొన్నాళ్లు ఆన్ లైన్ క్లాసులను మాత్రమే నిర్వహించాలని విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.

అందరికి ఆన్ లైన్ విద్యా బోధన ద్వారానే విద్య అందించాలని అన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల విషయంలో విద్యార్ధులను ఇబ్బంది పెట్టే అవకాశం లేకుండా నెలవారీ ఫీజు విధానాన్ని అమలు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube