తెలంగాణ విద్యాసంస్థల బంద్ అనే వార్తలకు క్లారిటీ ఇచ్చిన మంత్రి..!!

Telangana Education Minister Viral Comments

ఒమిక్రన్ అనే ప్రమాదకర వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు భయంతో పలు కీలక ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయి.ఆఫ్రికా దేశం లో ఈ వైరస్ వెలుగులోకి రావటంతో.

 Telangana Education Minister Viral Comments-TeluguStop.com

మిగతా ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి.సరిహద్దులను క్లోజ్ చేయటంతోపాటు ఆఫ్రికా నుండి వచ్చిన ప్రయాణికులకి.

విమానాశ్రయంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు.డెల్టా వైరస్ కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందే విధంగా ఈ కొత్త వేరియంట్ ఆఫ్రికా, యూరప్ దేశాలను గడగడలాడిస్తున్న తరుణంలో… భారత ప్రభుత్వం కూడా అప్రమత్తం అయ్యింది.

 Telangana Education Minister Viral Comments-తెలంగాణ విద్యాసంస్థల బంద్’ అనే వార్తలకు క్లారిటీ ఇచ్చిన మంత్రి..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే రాష్ట్రాలకు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఇటువంటి తరుణంలో కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే విద్యా సంస్థల విషయంలో ఆంక్షలు విధించినట్లు వార్తలు స్టార్ట్ అయ్యాయి.

వస్తున్న వార్తల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యాసంస్థల బంద్ కి.ప్రభుత్వం రెడీ అయినట్లు.స్కూల్స్ మరియు కళాశాలలు క్లోజ్ చేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.దీంతో వస్తున్న వార్తలపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు.తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలు క్లోజ్ అని వస్తున్న వార్తలలో వాస్తవం లేదని.తప్పుడు ప్రచారం అని ఖండించారు.

తెలంగాణ రాష్ట్రంలో యధావిధిగా విద్యాసంస్థలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్.

పాఠశాలలు యధావిధిగా కొనసాగించాలని అన్నారు.ఇటువంటి తరుణంలో స్కూల్స్ మూతపడడం అంటూ వస్తున్న వార్తలను విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరూ నమ్మవద్దని క్లారిటీ ఇచ్చారు.

స్కూల్స్ యాజమాన్యాలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.

#Telangana #Telangana #Rumros #Omicron #SabithaIndira

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube