ఎంసెట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు..!

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇంటర్ పరీక్షలను కూడా రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్ నిర్వహణపై దృష్టి పెట్టింది.విద్యార్ధుల ఇబ్బందులను అర్ధం చేసుకుని ఇప్పటికే ఎంసెట్ దరఖాస్తులను పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు.

 Telangana Eamcet Application Sumition Extend To July 8th, Application, Eamcet, E-TeluguStop.com

జూలై 1తో దరఖాస్తుల స్వీకరణ ముగియాల్సి ఉంది.కని కరోనా నేపథ్యంలో విద్యార్ధుల విజ్ఞప్తి మేరకు మరో వారం రోజులు దరఖాస్తు స్వీకరణ గడువు పెంచుతున్నట్టు తెలుస్తుంది.

ఎలాంటి పెనాల్టీ లేకుండా 08-07-2021 వరకు ఎంసెట్ దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ఎంసెట్ కనినర్ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ తెలిపారు.

ఇంజినీరింగ్, బీ ఫార్మసీ, బయోటెక్నాలజీ సీట్ల అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి.ఎంసెట్ పరీక్షలు జూలై 5 నుండి 9 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్ ఆధారణంగా జరుగుతాయి.

పరీక్షలు మొత్తం 9 సెషన్స్ లో ఉంటాయని అధికారులు వెల్లడించారు.అగ్రికల్చర్ వారికి 3, ఇంజినీరింగ్ వారికి 5 సెషన్లు, అవసరాన్ని బట్టి మరో సెషన్ ఉంటుందని అన్నారు.

ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరౌ.మళ్లీ తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహించనున్నారు. పొడించిన ఎంసెట్ దరఖాస్తు ప్రక్రియ ఎంతోమందికి ఉపయోగకరం కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube