లాక్ డౌన్ నేపథ్యంలో.. పోలీస్‌ ఉన్నతాధికారులతో తెలంగాణ డీజీపీ సమావేశం.. !

తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి అనగా 12.05.వ తారీఖు నుండి పది రోజుల పాటుగా లాక్‌డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ విషయానికి సంబంధించిన అన్ని మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

 Telangana Dgp Mahender Reddy Meeting With Police Superiors Over Lock Down-TeluguStop.com

ఈ నేపధ్యంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పోలీస్‌ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.

ఇక బుధవారం నుంచి రాష్ట్రంలో ఉదయం 10 గంటల నుండి, మరునాడు ఉదయం 6గంటల వరకు ఇలా పదిరోజుల పాటుగా లాక్ డౌన్ అమలు కానున్న క్రమంలో పోలీస్ అధికారులందరూ విధిగా క్షేత్రస్థాయిలో ఉండి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

 Telangana Dgp Mahender Reddy Meeting With Police Superiors Over Lock Down-లాక్ డౌన్ నేపథ్యంలో.. పోలీస్‌ ఉన్నతాధికారులతో తెలంగాణ డీజీపీ సమావేశం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాష్ట్రంలో కరోనా కేసులు విపరితంగా పెరుగుతుండటంతో అత్యవసర ప్రయాణాల కోసం ఈ పాస్ తప్పని సరి అని ఇలాంటి పాసులను కమిషనర్లు, ఎస్పీలు జారీ చేస్తారని తెలిపారు.ఇకపోతే ఈ కఠిన నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పెట్టాలని సూచించారు.

అలాగే జర్నలిస్టులు తమ అక్రిడేషన్లు, ఐడీ కార్డులను, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు గుర్తింపు కార్డులను తమ వెంట ఉంచుకోవాలని పేర్కొన్నారు.

#Journalists #Meeting #Telangana #Accreditation #Id Cards

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు