DGP Mahender Reddy: రాజకీయాల్లోకి మహేందర్ రెడ్డి.. ప్లాన్ రెడీ చేసుకున్న డీజీపీ!

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం పట్ల అచంచలమైన విధేయత చూపినందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం మహేందర్ రెడ్డికి పెద్ద బహుమానం లభించనుంది.డిసెంబరు నెలాఖరులోగా సర్వీసు నుంచి రిటైర్ కానున్న మహేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం ద్వారా రాజకీయాల్లోకి రాబోతున్నారని  మీడియాలో వార్తలు వస్తున్నాయి.

 Telangana Dgp Mahender Reddy Likely To Join Trs Party Details, Telangana, P Mahe-TeluguStop.com

 అతనికి పార్టీలో కీలక పదవి లేదా తదుపరి ఎన్నికలకు – రాష్ట్ర అసెంబ్లీ లేదా లోక్‌సభ టిక్కెట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

చాలా కాలంగా  ప్రభుత్వానికి విధేయంగా ఉంటుండంతో కేసీఆర్‌ మహేందర్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 హైదరాబాద్‌లో కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా కంట్రోల్‌ సెంటర్‌కు రూపకల్పన చేసినందుకు డీజీపీని ముఖ్యమంత్రి ప్రశంసించారు. డిసెంబరులో మహేందర్‌రెడ్డి పదవీ విరమణను ప్రస్తావిస్తూ, పదవీ విరమణ తర్వాత కూడా ఆయన సేవలను ప్రభుత్వం ఏదో ఒక రూపంలో వినియోగించుకుంటుందన్నారు.

“అతను మళ్ళీ కాకి డ్రెస్‌లో కనిపించకపోయిన, కానీ మేము అతని సేవలను మరో విధంగా ఉపయోగించుకంటామని” అని కేసీఆర్ ప్రకటించారు.

Telugu Cm Kcr, Mahender Reddy, Telangana, Telanganadgp, Trs-Political

 దీంతో మహేందర్‌రెడ్డిని రాజకీయాల్లోకి ఆహ్వానించి సముచితమైన పదవిని కట్టబెట్టే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు టాక్‌ వచ్చింది. ప్రస్తుతం ఆయన రిటైర్మెంట్‌కు నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో డీజీపీ రాజకీయ రంగ ప్రవేశంపై చర్చ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.

బ్యూరోక్రాట్లు, IPS అధికారులు పదవీ విరమణ చేసిన వెంటనే లేదా అకాల పదవీ విరమణ చేయడం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన సందర్భాలు చాలా ఉన్నాయి.

 ఇటీవల సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామి రెడ్డి వీఆర్‌ఎస్ తీసుకుని టీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు.  పదవీ విరమణ తర్వాత డీజీపీకి టీఆర్‌ఎస్‌లో ఏ పదవి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube