తెలంగాణలో మొదలైన వ్యాక్సిన్ రాజకీయం...అసలు వ్యూహం ఇదే

తెలంగాణలో రాజకీయ సమరానికి నేతలు రెడీగా ఉంటారు.దేనిని రాజకీయం చేయాలో దేనిని రాజకీయం చేయకూడదో కూడా అర్థం కాకుండా రాజకీయాలపై ప్రజలు విరక్తి చెందుతున్న పరిస్థితి నెలకొంది.

 Vaccine Politics Started In Telangana , Telangana Politics, Covid Vaccine, Etela-TeluguStop.com

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఎంతలా విజ్రుంభిస్తుందో మనం కళ్ళారా చూస్తున్నాం.మన కళ్ళ ముందే ప్రాణాలు పోతున్న పరిస్థితి ఉంది.

అయితే ఈ సమయంలో రాజకీయాలు పక్కన బెట్టి కలిసికట్టుగా పోరాడాల్సిన పార్టీలు ఇప్పుడు వ్యాక్సిన్ పేరుతో రాజకీయాలు చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే కరోనాను ఇప్పటికిప్పుడు నియంత్రించడం సాధ్యం కాదు.

అయితే ప్రభుత్వం కొంత మేరకు సౌకర్యాలు కల్పించడంలో ముందడుగు వేస్తే ప్రాణాలను కాపాడేలా చర్యలు చేపట్టే అవకాశం ప్రభుత్వం ఉంది.

అయితే కరోనా వ్యాక్సిన్ లు గుజరాత్ కు ఇస్తున్నట్లుగా తెలంగాణకు ఇవ్వడంలో వివక్ష చూపుతోందని, గుజరాత్ ఒక్కటే రాష్ట్రమా, తెలంగాణ దేశంలో భాగస్వామి కాదా అని మంత్రి ఈటెల దుయ్యబట్టిన పరిస్థితి ఉంది.

ఏది ఏమైనా వ్యాక్సిన్ రాజకీయాలు ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.అయితే రాష్ట్రానికి కావలసినన్ని ఇంజక్షన్లు కేంద్రం సరఫరా చూస్తున్నదని బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు.

కేసీఆర్ కరోనా సోకినది వాస్తవం అయితే ఇప్పటివరకు వ్యాక్సిన్ ఎందుకు వేయించుకోవడం లేదని, కేసీఆర్ వ్యాక్సిన్ వేయించుకోకుంటే ప్రజలలో అభద్రతా భావానికి లోనయ్యే అవకాశం ఉంటుందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది.అయితే వ్యాక్సిన్ రాజకీయం ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల్లో దోషిని చేసి రాజకీయ లబ్ధి పొందే ఆలోచనలో ప్రతిపక్షాలు ఉన్నాయని అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube