డిప్యూటీ సీఎం కు అవమానం ? కేసీఆర్ ఎందుకు ఇలా చేసాడు ?

కోపం వచ్చినా, ఆనందం వచ్చినా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆపడం ఎవరి వల్లా కాదు.ఆయనకు నచ్చితే నెత్తిన పెట్టుకోవడం, నచ్చకపోతే పాతాళానికి తొక్కేయ్యడం కేసీఆర్ కు మొదటి నుంచి ఉన్న అలవాటే.

 Kcr Not Give The Permission To Mohammadh Ali, Telangana, Corona Virus, Mohmmadh-TeluguStop.com

ఈ విషయంలో ముందు నుంచి అందరికి తెలిసియాన్ విషయమే అయినా ఎప్పటికప్పుడు కేసీఆర్ వ్యవహరించే తీరు అర్ధం కాక సొంత పార్టీ నాయకులే జుట్టు పీక్కుంటూ ఉంటారు.ఇక అసలు విషయానికి వస్తే, కెసిఆర్ కు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా మహమ్మద్ అలీ ఉన్నారు.

అందుకే ఆయనకు హోంశాఖ మంత్రిగా, తెలంగాణ డిప్యూటీ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు.ఇక కెసిఆర్ ఈ సమావేశం నిర్వహించినా, ఏ కార్యక్రమం చేసినా, పక్కనే మహమ్మద్ అలీ ఉంటారు.

ఇద్దరి మధ్య స్నేహం చాలా కాలం నుంచి ఇదే విధంగా ఉంటూ వస్తోంది.అయితే తాజాగా జరిగిన ఓ సంఘటనతో మహ్మద్ ఆలీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.

హోం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తనను స్వయంగా పోలీసులు అడ్డుకోవడంతో ఆయన చాలా అవమానానికి గురయ్యారట.ఇంతకీ ఏమైందంటే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కరోనా అంశంపై చర్చించేందుకు అత్యవసర సమావేశాన్ని ప్రగతి భవన్ లో ఏర్పాటు చేశారు.

ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొన్న వ్యక్తులకు కరోనా వైరస్ సోకిన వ్యవహారంపై చర్చించేందుకు సమావేశాన్ని కెసిఆర్ ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి బీజేపీతో సహా, ఉన్నతాధికారులు ప్రభుత్వం కీలక వ్యక్తులంతా హాజరయ్యారు.

అయితే ఇదే సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన హోం మంత్రి మహమూద్ అలీ ని పోలీసులు అడ్డుకోవడం, ఈ సమావేశంలో పాల్గొనేందుకు మీకు పర్మిషన్ లేదు అంటూ చెప్పడంతో ఆయన తీవ్ర అవమానానికి గురయ్యారు.అసలు పోలీసులు ఈ విధంగా చెప్పాలంటే ఖచ్చితంగా పై నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చి ఉండాలి.

లేకపోతే స్వయంగా తమ శాఖ అధిపతి, డిప్యూటీ సీఎం అయిన వ్యక్తి ని అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేయరు.

Telugu Corona, Deputycm, Kcr Press Meet, Md Ali, Mohmmadh Ali, Telangana-Politic

ఖచ్చితంగా కేసీఆర్ సూచనలతో ఈ విధంగా జరిగిందనేది స్పష్టమవుతోంది.అయితే మర్కస్ ప్రార్థనలకు వెళ్లిన వాళ్ళల్లో ఎక్కువ మంది పాతబస్తీకి చెందిన వారే ఉండటం, అదే ప్రాంతంలో మహమూద్ అలీ కూడా ఉండడంవల్ల, సమీక్షల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, ఖచ్చితంగా ఆ విషయాలన్నీ బయటకు వెళ్లిపోతాయి అనే ఉద్దేశంతో మహమ్మద్ అలీని కెసిఆర్ దూరం పెట్టినట్లు తెలుస్తోంది.మొదటి నుంచి తనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న కేసీఆర్ ఇప్పుడు ఈ సమావేశానికి తాను రాకుండా అడ్డుకున్న విషయాన్ని ఆయన అంత సీరియస్ గా తీసుకునే అవకాశం కూడా కనిపించడం లేదు.

ఎందుకంటే కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనకాల ఏదో ఒక బలమైన కారణం ఉంటుందని మహమ్మద్ అలీ భావిస్తుంటారు.

అదీ కాకుండా మొదటి నుంచి కేసీఆర్ వ్యక్తిత్వాన్ని, నిర్ణయాలను చాలా దగ్గర నుండి గమనిస్తున్న వ్యక్తి కావడంతో దీనిని ఆయన పెద్దగా పట్టించుకునే అవకాశం లేనట్టుగానే తెలుస్తోంది.

అయితే మీడియాలో మాత్రం దీని పైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube