వెయ్యి రూపాయలతో కరోనాకు చెక్!  

telangana, corona virus, covid 19, cm kcr - Telugu Cm Kcr, Coronavirus, Covid-19, Itala Rajendra, Telangana

కరోనా వైరస్ దేశంలో ఎలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికించేస్తోంది.

 Telangana Corona Virus Covid 19 Cm Kcr

ఇంకా తెలంగాణలోనూ రోజుకు 15వందలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.కరోనా భాదితులకు సరైన వైద్యం లేదంటే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ ప్రజలకు పలు సూచనలు చేశారు.రోగనిరోధక శక్తి లేనివారికే కరోనా వైరస్ వ్యాపిస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

వెయ్యి రూపాయలతో కరోనాకు చెక్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అంతేకాదు కరోనా వైరస్ ను కేవలం వెయ్యి రూపాయలతో చెక్ పెట్టచ్చు అని తెలిపారు.

ఖమ్మంలోని జిల్లా ఆస్పత్రిలో ట్రూనాట్ టెస్ట్ కేంద్రాన్ని మంత్రి అజయ్ తో కలిసి ఈటల రాజేందర్ ప్రారంభించారు.

వెయ్యి మంది కరోనా వైరస్ బారిన పడితే కేవలం 200 బెడ్స్ మాత్రమే అవసరం అని, పిహెచ్సి స్థాయిలోనే కరోనా వైరస్ ను అంతం చెయ్యచ్చు అంటూ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.ఇంకా ఈ వైరస్ ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్ అవసరమైన నిధులు కేటాయించినట్టు అయన తెలిపారు.

కాగా తెలంగాణాలో 62 వేల కరోనా కేసులు నమోదయ్యాయి.

#COVID-19 #Telangana #CM KCR #Itala Rajendra #Coronavirus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telangana Corona Virus Covid 19 Cm Kcr Related Telugu News,Photos/Pics,Images..