కరోనాతో గర్భిణి.. పురుటినొప్పులు ?.. సర్జరీ !

విధి నిర్వహణలో ఓ ఆశావర్కర్ కు కరోనా సోకింది.అప్పటికే ఆ మహిళ గర్భిణి.

 Pregnant With Corona Hemorrhoids Surgery  Telangana, Corona Peshent, Delevary-TeluguStop.com

కరోనా పాజిటివ్ వచ్చినప్పటి నుంచి హోం క్వారంటైన్ ఉంటూ చికిత్స పొందుతుంది.కాగా, ఆమెకు పురిటినొప్పులు రావడంతో వైద్యులు ప్రాణాలు తెగించి సర్జరీ చేసి ఆమె ప్రాణాలు కాపాడారు.

ఈ ఘటన తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.

వివరాళ్లోకి వెళితే.

బషీరాబాద్ మండలం గంగ్వార్ గ్రామానికి చెందిన లక్ష్మీ ఆశావర్కర్ గా విధులు నిర్వహిస్తోంది.కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు గ్రామాలలో పర్యటించి పరీక్షలు నిర్వహించిన తరుణంలో ఆమెకు కొద్ది రోజు కిందట కరోనా లక్షణాలు బయటపడ్డాయి.

దీంతో కరోనా పరీక్షలు నిర్వహించగా పాటిజిట్ అని తేలింది.అప్పటికే లక్ష్మీ గర్భిణి కావడంతో డాక్టర్లు ఆమెను హోం క్వారంటైన్ లో ఉంచి చికిత్సను అందిస్తున్నారు.

కాగా, శనివారం అర్ధరాత్రి ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి.దీంతో కుటుంబ సభ్యులు తాండూరు ఆస్పత్రికి తరలించారు.లక్ష్మీని పరీక్షించిన గైనకాలజిస్ట్ శిరీష కడుపులో బిడ్డ చనిపోయాడని, వెంటనే సర్జరీ చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆనంద్ కు తెలిపింది.ఎమర్జెన్సీ కేసు కావడంతో వైద్యులు ఆమెను అక్కడే సర్జరీ చేశారు.

కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ పిండాన్ని తొలగించారు.అనంతరం లక్ష్మీని కోవిడ్ వార్డుకు తరలించి ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తూ చికిత్స చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube