ఎల్బి స్టేడియం ముందు కోచ్ ల నిరసన..!

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణా కాంట్రాక్ట్ కోచ్ శాట్స్ కోచ్ లు శనివారం హైదరాబాద్ ఎల్బి స్టేడియం వద్ద ధర్మాకు దిగారు.పాతికేళ్లు పైగా పనిచేస్తున్నా సరే ఇంకా కాంట్రాక్ట్ కోచ్ లుగానే పరిగణిస్తున్నారని.

 Telangana Contract Coach Protest At Lb Stadium, Contract Coach, Lb Stadium, Prot-TeluguStop.com

తమని రెగ్యులరైజ్ చేయాలంటూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణా కాంట్రాక్ట్ కోచ్ శాట్స్ కోచ్ లు నిరసనకు దిగారు.తమ కోచ్ పదవులను రెగ్యులరైజ్ చేయమని ఎన్నిసార్లు ప్రభుత్వ పెద్దలని అడిగినా సరైన స్పందన రాలేదని ఈ ధర్నా చేస్తున్నట్టు వారు చెప్పుకొచ్చారు.

తెలంగాణా వచ్చాక బతుకులు బాగుపడతాయని అనుకుంటే.సీన్ రివర్స్ అయ్యిందని కోచ్ లు ఆవేదన చెందుతున్నారు.

తమ జీతాలు కూడా సరైన టైం కు అందడం లేదని వారు చెప్పారు.

తెలంగాణా కాంట్రాక్ కోచ్ నేత రవి శంకర్ తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని.

సమయానికి వేతనాలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.క్రీడలు ఎంతో పవిత్రమైనవి.

ఈ రంగంలో 1993 నుండి సేవలు అందిస్తూ వస్తున్నాం.మా కష్టాలను గుర్తించండి.

తాము ఎవరిని విమర్శించడం లేదని.కోచ్ ల వల్ల ఆటగాళ్లకు క్రమశిక్షణ, క్యారక్టర్ డెవలప్ అవుతుందని.

చైర్మన్ వెంకట్ రెడ్డి వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube