ఎమ్మెల్సీ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ మల్ల గుల్లాలు

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నెలకొన్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించడం ఏకగ్రీవం అయిందన్న మనకు తెలిసిందే.

 Telangana Congress Wrestles Over Mlc Elections Details, Telangana Politics, Tela-TeluguStop.com

అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మాత్రం మల్లగుల్లాలు పడుతోంది.అయితే స్థానిక సంస్థలకు సంబంధించి అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పోటీలో ఉంటుందని అందరూ భావించారు.

కానీ ఒక్క రెండు జిల్లాల్లో మాత్రమే పోటీ చేయాలని కాంగ్రెస్ పోటీలో ఉండాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.అందుకు ప్రధాన కారణమేమిటనే విషయాన్ని పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రయత్నిస్తోంది.

అయితే ఇప్పటికే కాంగ్రెస్ కు అత్యంత బలమైన నియోజకవర్గాలలో ఒకటైన హుజూరాబాద్ లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడం తో స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా అన్ని జిల్లాల్లో పోటీ చేస్తే ఆ తరువాత ఒడిపోతే మరల కాంగ్రెస్ పార్టీ మరల చర్చకు వచ్చే అవకాశం ఉంది .అంతేకాకా కాంగ్రెస్ మరల ఓడిపోయిందనే ప్రచారం సాగితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఎదగడం చాలా కష్టమైన విషయం.

Telugu Congress, Mlc, Pcc, Revanth Reddy, Telangana Mlc, Telangana, Trs-Politica

అందుకే ఎక్కడైతే సత్తా చాటగలం అని నమ్మకం ఉన్న దగ్గర మాత్రమే  కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది.కొన్ని జిల్లాల్లో పోటీ చేసినా పోటీ చేయని జిల్లాల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉందని పరోక్షంగా తెలియజేసినట్టు అవుతుంది.కానీ పోటీ చేసి ఓటమి పాలైతే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.ఏది ఏమైనా ఒకప్పడు ఉమ్మడి రాష్ట్రంలో అధికారం చేపట్టి బలమైన పార్టీగా వెలుగొందిన పార్టీ నేడు ఎన్నికల్లో పోటీ చేయాలంటే సంశయించే పరిస్థితి రావడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube