రేవంత్ ఉతుకుడు : బీజేపీ టీఆర్ఎస్ పై నిప్పులు

ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోరు సాగుతోంది.టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ ప్రయత్నించడం,  బీజేపీ పై టీఆర్ఎస్ నాయకులు ఎదురు దాడి చేయడం వంటి వ్యవహారాలు చోటుచేసుకుంటున్నాయి.

 Revanth Reddy Fires On Bjp And Trs Leaders,revanth Reddy, Bjp, Trs, Cm Kcr,telan-TeluguStop.com

దీంతో టీఆర్ఎస్ బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందనే చర్చ జరుగుతోంది.దీంతో కాంగ్రెస్ వ్యవహారం చర్చకు రావడం లేదు.

అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభావం లేదనే లెక్కలు తెరమీదకు వచ్చిన క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి స్పందించారు.
బీజేపీ, టీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు తెలంగాణ రాజకీయాల్లో రోజుకో వీధి భాగోతం నడుస్తోందని విమర్శించారు.

  ఇతర రాష్ట్రాలలో నటులను ఇక్కడకు తీసుకు వచ్చి రంజింప చేసే పనిలో బీజేపీ ఉందంటూ రేవంత్ విమర్శించారు.కాంగ్రెస్ కు రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని రేవంత్ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉన్న బంధాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ విమర్శలు చేశారు.కెసిఆర్ రూపొందించిన కొత్త జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదంతో రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకు వచ్చిందని, జీవో నెంబర్ 317 తో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారని రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 ఉందంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యోగుల్లో కొంతమందిని తనవైపుకు తిప్పుకునే ఆలోచనలో జీవో నెంబర్ 317 ఉందని, నాలుగు లక్షల మంది ఉద్యోగుల లో చిచ్చు పెట్టారని రేవంత్ మండిపడ్డారు.ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ దీక్ష చేస్తా అంటారు.జాగరణ అంటే నైట్ క్యాంప్ ఆఫీస్ లో పడుకుని పొద్దుగాల ఇంటికి పోతా అన్నాడు.అది ఏదో పెద్ద సమస్య అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కట్టర్లు , గ్యాస్ ప్రయోగించింది అని ఎద్దేవా చేశారు.

అరెస్టు చేసిన 48 గంటల్లో సమస్య ముగిసింది.బీజేపీ నేతలు గంగిరెద్దుల వాళ్ళ లెక్క వచ్చిపోతున్నారు.కార్గిల్ వీరుని ముద్దాడినట్లు సంజయ్ ను బీజేపీ ముఖ్యమంత్రులు ముద్దు ఆడుతున్నారు.బీజేపీ వాళ్లకు ఏమైనా బుద్ధి ఉందా ? రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదికకు కేంద్రమే ఆమోదం తెలిపితే రాష్ట్ర పతి ఉత్తర్వులు ఇచ్చింది మీరే కదా ?  రాష్ట్రం పంపిన నివేదిక తప్పు అయితే కేంద్ర మంత్రివర్గం ఆమోదం ఎలా పొందింది అని రేవంత్ ప్రశ్నించారు.బండి.గుండు ఇద్దరు ఉద్యోగులను మోసం చేస్తున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే జీవో 317 పై న్యాయం చేయట్లేదు.రాష్ట్రంలో అధికారంలోకి వస్తే న్యాయం చేస్తారా ? లెఫ్ట్ నేతలను కెసిఆర్ ఇంటికి పిలిచి డ్రామాలు మొదలుపెట్టారు కెసిఆర్ బీజేపీ పంజరంలో చిలుక అంటూ రేవంత్ సెటైర్లు వేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube