పీసీసీ అధ్యక్షుడి నియామకం పెద్ద తలనొప్పే ?

ఒకరకంగా చెప్పకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది.చెప్పుకోవడానికి జాతీయ పార్టీ అయినా అక్కడ ఉనికి కోసం నిరంతరం పోరాడాల్సిన పరిస్థితి.

 The Appointment Of The President Of The Pcc Has Become An Embarrassment For The-TeluguStop.com

ప్రత్యేక తెలంగాణ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరింత బలపడుతుందని, అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానం అంచనావేసి ఏపీ, తెలంగాణలో రెండుగా విభజించింది.అయినా ఆ పార్టీకి ఆదరణ దక్కకపోగా, మరింతగా దిగజారిపోయింది.

ఇదిలా ఉంటే స్వతహాగా గ్రూపు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరుగా ఉంటుంది.నాయకులు ఒకరిపై ఒకరు నిత్యం విమర్శలు చేసుకుంటూ, సొంత పార్టీ పరువు బజారు పడేస్తూ ఉంటారు.

అంతా కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకు వెళ్లే విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు.

Telugu Congress, Jagga, Komatireddy, Pcc, Revanth Reddy, Telangana-

ఇప్పటికే రెండుసార్లు అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి అసలు బరిలో ఉంటుందా లేదా అనే సందేహాలను కలిగిస్తోంది.ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ కి కొత్త పిసిసి అధ్యక్షుడు నియమించి, పార్టీ ని పరుగులు పెట్టించాలని, ఆ పార్టీ అధిష్టానం చాలా కాలంగా భావిస్తున్నా , అందుకు తగ్గ పరిస్థితులు ఆ పార్టీలో కనిపించడం లేదు.పిసిసి అధ్యక్ష పదవిని భర్తీ చేయడం ఆ పార్టీ అధిష్టానానికి కత్తి మీద సాములా మారింది.

ఇప్పటికే ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి శైలజానాథ్ ను నియమించారు.అలాగే కర్ణాటకలో డీకే శివకుమార్ ను పిసిసి అధ్యక్షుడిగా నియమించారు.కానీ తెలంగాణలో ఆ పదవిని భర్తీ చేయాలంటే మాత్రం అధిష్టానం చొరవ చేయలేకపోతోంది.

Telugu Congress, Jagga, Komatireddy, Pcc, Revanth Reddy, Telangana-

ప్రస్తుత పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలోని రెండుసార్లు పార్టీ ఓటమి చెందడంతో, ఆయన స్వయంగా తాను ఆ పదవి నుంచి తప్పుకుంటానని అధిష్టానానికి చెప్పడంతో, కొత్త అధ్యక్షుడు ను నిర్మించేందుకు ఎప్పటి నుంచో అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి కి, పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే, ఆయన సారథ్యంలో పార్టీ మరింతగా బలపడుతుందని, అధిష్టానం అభిప్రాయపడుతుండగా, ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయనకు ఆ పదవి ఇచ్చేందుకు వీల్లేదని మిగతా కాంగ్రెస్ సీనియర్లు అంతా అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి, జగ్గారడ్డి వంటివారు పిసిసి అధ్యక్ష పదవి కన్నేశారు.

ఈ సమయంలో ఎవరికి పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగించినా, మిగతావారు పార్టీకి చాలా డ్యామేజ్ చేసే అవకాశం ఉన్నట్లుగా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది అందుకే ఎప్పటికప్పుడు ఈ నిర్ణయం వాయిదా వేసుకుంటూ వస్తున్నట్టుగా కనిపిస్తోంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube