వీళ్లు మారరా: రసాభాసగా మారిన కాంగ్రెస్ సమావేశం

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ మరికొద్దిరోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ గెలుపు మాదే అంటూ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తూ ఇప్పటికే అనేక సర్వేలు చేయించుకున్నారు కేసీఆర్.

 Telangana Congress Meeting Smiles-TeluguStop.com

ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మాత్రం ఇప్పటికీ ఆ దిశగా మాత్రం అడుగులు వేయలేకపోతోంది.తాజాగా మున్సిపల్ ఎన్నికల నిమిత్తం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది.

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల సమీక్ష సమావేశం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు నిర్వహించగా జనగామా, యాదాద్రి జిల్లాల నాయకుల మధ్య అంతర్గత విబేధాలు బయటపడ్డాయి.ఇరు వర్గాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పార్టీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ముందే ఘర్షణకు దిగారు.

దీంతో అక్కడికి వచ్చిన వారంతా చెల్లచెదురయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube