పెరిగిన పోటీ : ఢిల్లీ చుట్టూ చక్కెర్లు కొడుతున్న టీ.కాంగ్రెస్ నేతలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు నిస్తేజంలో ఉన్న కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం పెంపొందించేలా కాంగ్రెస్ హై కమాండ్ చర్యలు ప్రారంభించింది.దీనికోసం ఇప్పటికే కొంతమంది పేర్లను అధిష్టానం పరిశీలనలో తీసుకుంది.

 Telangana Congress Leaders Participate In Bharath Bachavo-TeluguStop.com

అయితే అధిష్టానం తీసుకున్నపేర్లు ఎవరెవరివి అనేవి స్పష్టమైన క్లారిటీ లేకపోవడంతో ఎవరికి వారు పదవి తమకే వస్తుందని ఊహాగానాల్లో ఉన్నారు.పనిలో పనిగా ఢిల్లీలో తమకున్న పరిచయాలను ఉపయోగించుకుని తెలంగాణ పిసిసి పదవిని దక్కించుకోవాలని ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

తాజాగా తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న నాయకులంతా ఢిల్లీ బాట పట్టారు.భారత్ బచావో ప్రోగ్రాం లో పాల్గొనేందుకు కాంగ్రెస్ నాయకులు వెళ్లారు.

ఆ సందర్భంగా హైకమాండ్ దృష్టిలో పడి తెలంగాణ పీఠం దక్కించుకోవాలని ఆశతో ఎవరికి వారు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Telugu Revanth Reddy-

ఏఐసీసీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా భారత్ బచావో కార్యక్రమాన్ని కాంగ్రెస్ హైకమాండ్ చేపట్టింది.ఈ కార్యక్రమం కోసం తెలంగాణ నుంచి సీనియర్ నాయకులతో పాటు టి పిసిసి పదవి ఆశిస్తున్న నాయకులంతా తమ అనుచరులను, తమ మద్దతుదారులను ఢిల్లీకి తీసుకెళ్లి అధిష్టానానికి పరిచయం చేస్తూ, ఎవరికి వారు హడావుడి చేస్తున్నారు.ప్రస్తుతం పిసిసి బాధ్యతలు నిర్వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పదవి నుంచి తప్పుకుంటానని అధిష్టానానికి ఇప్పటికే తేల్చి చెప్పేయడంతో సామాజిక వర్గాల వారీగా టిపిసిసి పదవిని దక్కించుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు.ప్రస్తుతం టి పిసిసి రేసులో ఉన్న నాయకుల జాబితా ఒకసారి పరిశీలిస్తే

Telugu Revanth Reddy-

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దామోదర రాజనరసింహ భట్టివిక్రమార్క, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి తదితరులు పీసీసీ పదవి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు .తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు తమకు అప్పగిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేకుండా చేస్తామని, వచ్చే ఎన్నికల నాటికి బలం పుంజుకునేలా చేసి అధికారంలోకి తీసుకు వస్తాము అంటూ అధిష్టానం దగ్గర మార్కులు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.అయితే పి సి సి అధ్యక్ష పదవి కోసం హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చే డంతో పాటు సమర్ధుడైన ఒక నేత పేరును పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube