జానా గెలుపుపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ వాదులు...గెలిచినిలిచేనా?

రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఊహించలేం.ముందు అనుకున్న వ్యూహం ఒకటుంటే ఆ వ్యూహం అమలు చేసిన తరువాత పరిస్థితి వేరే ఉంటుంది.

 Telangana Congress Leaders Hoping For Janareddy Victory In Nagarjuna Sagar-TeluguStop.com

దీనికి ప్రత్యక్ష ఉదాహరణ తెలంగాణ కాంగ్రెస్.తెలంగాణ ఇచ్చిన తరువాత టీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనమవుతుందని, తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణలో సత్తా చాటుతుందని, ఏక ఛత్రాధిపత్యం వహించవచ్చనే అతి పెద్ద వ్యూహం వేశారు.కాని తెలంగాణ ఇచ్చిన తరువాత సీన్ రివర్స్ అయింది.టీఆర్ఎస్ అధికారం లోకి రావడం, కాంగ్రెస్ సత్తా చాటడంలో విఫలం కావడం అనే చరిత్ర మన కళ్ళ ముందే జరిగింది.

ఇక అప్పటి నుండి కాంగ్రెస్ జరిగిన ప్రతి ఎన్నికల్లో తన స్థాయికి తగ్గట్టు సత్తా చాటలేకపోయింది.అలా దుబ్బాక, గ్రేటర్ ఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ చతికిల పడింది.

 Telangana Congress Leaders Hoping For Janareddy Victory In Nagarjuna Sagar-జానా గెలుపుపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ వాదులు…గెలిచినిలిచేనా-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్పుడు కాంగ్రెస్ కంచు కోట అయిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి గెలుపుపై పెద్దగా ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్.ఇక కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితిని జీర్ణించుకోలేక పోతున్నారు.

జానా గెలిస్తే కాంగ్రెస్ కు ప్రజల్లో కొంత గుర్తింపు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.మరి జానా గెలిచి కాంగ్రెస్ కు పూర్వ వైభవం కలిపిస్తాడా అనేది చూడాల్సి ఉంది.

#NagarjunaSagar #Congress Party #CongressLeader

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు