ప్ర‌గ‌తి భ‌వ‌న్ మైండ్ గేమ్‌లో కాంగ్రెస్ నేత‌లు.. అడ్డంగా బుక్క‌య్యారే..!

అధికారంలోకి వ‌చ్చి ఏడేళ్ల‌యినా క‌నీసం ప్ర‌తిప‌క్షాల‌తో ఒక్కసారి కూడా క‌ల‌వ‌ని కేసీఆర్ నిన్న రాత్రి టీ కాంగ్రెస్ నేత‌ల‌ను పిలిచి ఓ విష‌యంపై మాట్లాడారు.ఖ‌మ్మం జిల్లాలోని దళిత మహిళ అయిన మరియమ్మ విష‌యంలో పోలీసులు తీవ్రంగా కొట్టి ఆమెను లాకప్ డెత్ చేయ‌డం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా సృష్టించింది.

 Telangana Congress Leaders Booked In Pragati Bhavan Mind Game, Kcr, Trs, Politic-TeluguStop.com

దీంతో ఇదే అదునుగా టీ కాంగ్రెస్ నేత‌లు రెచ్చిపోయారు.ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

ఇక అదే టైమ్‌లో కేసీఆర్ కూడా దీన్ని సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక మీడియాలో వ‌రుస క‌థ‌నాలు రావ‌డంతో రియాక్ట్ అయ్యారు కేసీఆర్‌.

అయితే కాంగ్రెస్ నేత‌లు భ‌ట్ట‌విక్ర‌మార్క‌, జ‌గ్గారెడ్డి, శ్రీధ‌ర్‌బాబులు క‌లిసి కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరారు.కానీ మొద‌ట దానికి ప్రగ‌తి భ‌వ‌న్‌ నుంచి టైమ్ లేద‌ని చెప్పారు.

దీంతో కాంగ్రెస్ నేత‌లు ఇంకో ప్లాన్ వేసేలోపే మ‌ళ్లీ గంట‌ల వ్య‌వ‌ధిలోనే కేసీఆర్ వారికి ఫోన్ చేయించిడం అపాయింట్‌మెంట్ ఓకే చేయించ‌డం జ‌రిగిపోయాయి.ఇక దొరికిందే అవ‌కాశం అన్న‌ట్టు కాంగ్రెస్ నేత‌లు రెచ్చిపోయి మ‌రీ కేసీఆర్ వ‌ద్ద‌కు పరుగులు పెట్టారు.

కానీ అక్క‌డ మాత్రం అస‌లు విష‌యం ఇదే అంటూ మ‌రో టీ కాంగ్రెస్ నేత చెబుతున్నారు.

Telugu @cm_kcr, Kcr, Sridhar Babu, Congresss-Political

అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు ఏడేళ్లుగా అపాయింట్ మెంట్ ఇవ్వని సీఎం ముందు లేద‌ని త‌ర్వాత ర‌మ్మ‌ని చెప్పిన‌ప్పుడు ఇదే కాంగ్రెస్ నేత‌లు త‌మ‌కు వెళ్లడం ఇష్టం లేద‌ని చెప్పిన‌ట్టు ఉంటే ప‌రిస్థితి మరోలా ఉండేద‌ని కాంగ్రెస్ నేత ఒకరు స్ప‌ష్టం చేస్తున్నారు.సీఎం కేసీఆర్ నుంచి అపాయింట్‌మెంట్ పిలుపు వచ్చిన పిద‌ప‌నే కాంగ్రెస్ నేత‌లు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అపాయింట్‌మెంట్‌ను కాద‌ని చెప్పిన‌ట్టు ఉంటే గుర్తింపు ద‌క్కేద‌ని వివ‌రించారు.అంటే టీ కాంగ్రెస్ నేత‌లు ప్ర‌గ‌తి భ‌వ‌న్ మైండ్‌గేమ్‌లో బుక్క‌య్యార‌న్న‌మాట‌.

మొత్తానికి కేసీఆర్ మాస్ట‌ర్ స్కెచ్ బాగానే ప‌నిచేసిన‌ట్టుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube