కూటమి అధికారంలోకి వస్తే ... సీఎం ఆయనే అంట !  

Telangana Congress Leader Sarve Satyanarayana Sensetional Coments-

తెలంగాణాలో ఇంకా పోలింగ్ పూర్తి కాలేదు…కానీ కాంగ్రెస్ లో మాత్రం అప్పుడే నాయకులు సీఎం పీఠం పై కన్నేశారు. అప్పుడే తాము రేసులో ఉన్నాము అన్న సంకేతాలను పంపుతున్నారు. తాజగా… ఈ విధమైన వ్యాఖ్యలే చేసాడు ఓ కాంగ్రెస్ ఎమ్యెల్యే అభ్యర్థి.ఎన్నికల్లో ప్రజాకూటమి అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ కూటమి అభ్యర్థి సర్వే సత్యనారాయణ అన్నారు..

కూటమి అధికారంలోకి వస్తే ... సీఎం ఆయనే అంట !-Telangana Congress Leader Sarve Satyanarayana Sensetional Coments

కంటోన్మెంట్‌ పరిధిలోని కార్ఖానా, కాకగూడలో కాంగ్రెస్‌ మహిళా నాయకురాలు నగ్మతో కలిసి రోడ్డు షోలో పాల్గొన్న ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చి మాట తప్పారని గుర్తుచేశారు.

ఒకవేళ కాంగ్రెస్‌ అధిష్ఠానం దళితుడిని సీఎం చేస్తానని నిర్ణయిస్తే దళితుడైన తనకు ఆ అవకాశం రావొచ్చని అభిప్రాయపడ్డారు. కనీసం డిప్యూటీ సీఎం పదవి అయినా వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. అదీ లేకుంటే మంత్రినైనా అవుతానని అన్నారు..