రండి బాబు రండి.. ముగ్గురూ రండి     2018-12-04   19:35:59  IST  Sai M

ఈ రోజు వేకువజామున తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని సాయంత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే . అయితే… ఆ తరువాత పోలీసులు సాయంత్రం సమయంలో కొడంగల్ లో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఇంటికి చేరుకున్న రేవంత్ ఆ తరువాత ప్రెస్ మీట్ పెట్టి మరీ టీఆర్ఎస్ నాయకుల మీద తీవ్ర విమర్శలు చేశారు.

Telangana Congress Leader Revanth Reddy Challange To Kcr-

కొడంగల్‌పై కేసీఆర్‌ యుద్ధం ప్రకటించారని అన్నారు. ఇక్కిడి ప్రజలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ‘కొడంగల్‌కు ముందు నీ కొడుకు కేటీఆర్‌.. ఆ తర్వాత అల్లుడు హరీష్‌రావు వచ్చారు. ఇప్పుడు నువ్వే వచ్చావు. ఇంకా ఎన్నికలకు 48 గంటల సమయం ఉంది. ఒక్కొక్కరు కాదు.. ముగ్గురూ కలిసి రండి. కొడంగల్‌ చౌరస్తాలో తేల్చుకుందాం’ అని కేసీఆర్‌కు రేవంత్‌ సవాల్‌ విసిరారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.