కాంగ్రెస్ ఆశలన్నీ రేవంత్ మీదేనా ..అందుకే ఇలా చేసిందా ..?

రేవంత్ రెడ్డి ! ఈ పేరు తెలంగాణ రాజకీయాల్లో బాగా ఫెమస్.టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినా రేవంత్ హవా ఏమాత్రం తగ్గలేదు.

 Telangana Congress Depends Upon Revanth Reddy1-TeluguStop.com

అసలు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల హవా ఎక్కువ.దీనికి తోడు గ్రూపు రాజకీయాలు ఈ నేపథ్యంలో రేవంత్ ఎదుగుదలను ఆ పార్టీలో సీనియర్లు అడ్డుకుంటారని … ఈ గ్రూపు తగాదాల్లో రేవంత్ ఇమడలేదని ఆయన తిరిగి తన సొంత గూటికి వెళ్ళిపోతాడని అనేక వార్తలు వినిపించాయి.

అయితే రేవంత్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు.టీఆర్ఎస్ అధినేత కుటుంబమే లక్ష్యంగా… రేవంత్ తరుచూ విమర్శలు గుప్పిస్తూ… అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కుంటూ… అధిష్టానం దృష్టిలో మంచి మార్కులు కొట్టేసాడు రేవంత్.

ప్రస్తుతం తెలంగాణాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతా తానే అన్నట్టుగా వ్యవహరిస్తూ… కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు చేస్తున్నా.రేవంత్ రెడ్డికి మాత్రం.ఢిల్లీలో పలుకుబడి తగ్గడం లేదు.రెండు రోజుల కిందట.ఆయన నామినేషన్ కార్యక్రమం తెలంగాణలోనే హాట్ టాపిక్ అయింది.ఓ భారీ బహిరంగసభకు వచ్చిటనట్లు.

కొడంగల్ ప్రజలు తరలి రావడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.దీనిపై ప్రధాన మీడియా పెద్దగా కవరేజీ ఇవ్వకపోయినా.

సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.సభల నిర్వహణలో.

రేవంత్ పనితనం మెచ్చిన రాహుల్ గాంధీ ఇరవై మూడో తేదీన మేడ్చల్ సభ బాధ్యతలను రేవంత్ నే తీసుకోవాల్సిందిగా కోరారట.

ఈ మధ్యకాలంలో … రాహుల్ రెండు సార్లు తెలంగాణ పర్యటనకు వచ్చారు.ఇటీవల ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత వరుసగా మూడు సభల్లో పాల్గొన్నారు.ఆయా సభల్లో.

రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు.ప్రజల్లో వచ్చిన స్పందనను.

రాహుల్ గాంధీ చూశారు.అంతే కాకుండా రాహుల్ చేయించిన అంతర్గత సర్వేల్లోనూ… రేవంత్ హవా టాప్ రేంజ్ లో ఉన్నట్టు తేలడంతో రాహుల్ కి రేవంత్ మీద పూర్తి నమ్మకం పెరిగినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం సోనియా గాంధీ సభ నిర్వహణ బాధ్యతలు చూసే అవకాశం రావడంతో రేవంత్ రెడ్డి తన సత్తా నిరూపించుకుని అదే అర్హతతో సీఎం పీఠం పై కూర్చోవడానికి మార్గం సుగమం చేసుకుంటున్నాడు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube