కర్ణాటక వ్యూహాలనే నమ్ముకున్న తెలంగాణ కాంగ్రెస్ ?

త్వరలో జరగబోయే తెలంగాణ( Telangana ) సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా కాంగ్రెస్ ను గెలిపించి అధికారంలోకి రావాలనే పట్టుదల ఆ పార్టీ అధిష్టానం పెద్దల్లో కనిపిస్తోంది.కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో, ఆ పార్టీలో ఉత్సాహం నెలకొంది.

 Telangana Congress Believes In Karnataka Strategy , Karnataka Congress, Congress-TeluguStop.com

అదే విధంగా తెలంగాణలోనూ అధికారంలోకి వస్తే, ఆ ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుందనే అంచనాలో ఉంది.అందుకే తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేకంగా దృష్టి సారించింది.

ఇక వరుస వరుసగా కాంగ్రెస్ కీలక నేతలంతా తెలంగాణలో పర్యటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా( Priyanka Gandhi, Rahul Gandhi, Sonia ) అందరూ ఒక్కొక్కరుగా తెలంగాణలో పర్యటించి భారీ బహిరంగ సభలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

బీఆర్ఎస్, బిజెపి లకు ధీటుగా తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.అందుకే తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న గ్రూపు రాజకీయాలన్నిటిని పక్కనపెట్టి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు.

Telugu Brs, Congress, Karnataka, Revanth Reddy, Telangana Bjp, Telangana-Politic

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహాలే అక్కడ విజయం సాధించడానికి కారణమైందని, బిజెపి( BJP ) నుంచి గట్టి పోటీ ఎదురైనా, ఆ వ్యూహాలే పని చేశాయనే నమ్మకం కాంగ్రెస్ అధిష్టానం పెద్దల్లో ఉంది.అందుకే తెలంగాణ లోను కర్ణాటక వ్యూహాలనే అమలు చేయాలని నిర్ణయించింది.కర్ణాటక తరహా లోనే తెలంగాణలోను టికెట్లను కేటాయించాలనే నిర్ణయానికి వచ్చారట.తెలంగాణలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న బీసీలను ఏకం చేసి, వారిని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది.

వారి మద్దతు ఉంటే తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించడం అంత కష్టమేమీ కాదన్న అభిప్రాయం ఆ పార్టీలో నెలకొంది.తెలంగాణలో బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువ.అయితే పార్టీల వారీగా ఆ ఓటు బ్యాంకు చీలిపోవడంతో, ఇప్పుడు వారందరినీ ఏకం చేసి కాంగ్రెస్ వైపు వారి దృష్టి పడే విధంగా వ్యూహాలు రచిస్తోంది.

Telugu Brs, Congress, Karnataka, Revanth Reddy, Telangana Bjp, Telangana-Politic

దీనిలో భాగంగానే విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీ వర్గాల రిజర్వేషన్ 40 శాతానికి పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించబోతున్నారు.కర్ణాటక తరహాలోనే జనాభా ప్రాతిపదికన టిక్కెట్ల కేటాయింపు జరుగుతాయని, వచ్చే ఎన్నికల్లో బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ లో చర్చ జరుగుతుంది.దీంతో పాటు పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను హైలెట్ చేయాలని , ఇప్పటి వరకు బిఆర్ఎస్ ప్రభుత్వ పాలన రెండు రకాలుగా చూశారని, ఈసారి కాంగ్రెస్ అవకాశం ఇవ్వాలని ఒక్క ఛాన్స్ పేరుతో జనాల్లో సెంటిమెంట్ ను రగిలించే విధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube