ఫాంలోకి వస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్..యాదాద్రి జిల్లాలో పర్యటనకు ముహూర్తం ఖరార్.. !

తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయంటున్నారు విశ్లేషకులు.దీనికి కారణం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ నుండి ఈటల బయటపడటమే అని ప్రచారం జరుగుతుంది.

 Telangana Cm Kcr To Visit Yadadri-TeluguStop.com

ఎందుకంటే మరోసారి తెలంగాణలో గులాభి జెండా రెపరెపలాడాలంటే ఆ జెండాకు అడ్డుగా ఈటల ఉన్నాడట.

ఇంతకాలం అంటే కారుకు ఎదురుగా నిలబడే సాహసం ఎవరు చేయలేదు.

 Telangana Cm Kcr To Visit Yadadri-ఫాంలోకి వస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్..యాదాద్రి జిల్లాలో పర్యటనకు ముహూర్తం ఖరార్.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అప్పుడు ఏం చేసిన నడిచింది.కానీ అన్ని రోజులు ఒకే ప్రభుత్వానికి ఉండవు కదా.అందుకే ఈటల నుండి పార్టీని రక్షించుకోవాలంటే, పదవులు కాపాడుకోవాలంటే ఎప్పటిలా ఫాం హౌస్‌లో ఉంటే సరిపోదని గ్రహించిన గులాభి బాస్ ఫాంలోకి వచ్చాడట.ఈ క్రమంలో ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్‌కు భారీగానే నిధులను విడుదల చేశారు.

ఇక వరంగల్‌ను అయితే అంతార్జాతీయ స్దాయిలో తీర్చి దిద్దుతానని శపధం కూడా చేశారు.కాగా తాజాగా యాదాద్రి జిల్లాలోని వాసాలమర్రి గ్రామాన్ని ఈ నెల 22న సీఎం కేసీఆర్ సందర్శించాలని ముహూర్తం ఖరార్ చేసుకున్నారట.

ఈ నేపధ్యంలో గ్రామ సర్పంచి అంజయ్యకు ఫోన్ చేసి తాను వస్తున్నట్లుగా, అందరికి భోజనాలు, సభకు ఏర్పాట్లు చేయవలసిందిగా కోరారట.ఏది ఏమైనా ప్రత్యర్ధులను చిత్తు చేయడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా అని అనుకుంటున్నారట ఈ విషయం తెలిసిన ప్రజలు.

మరి మరో సారి సీఎం పదవి దక్కాలంటే ఇప్పటి నుండే ఎత్తులు వేయాలి కదా !

#TelanganaCM #Huzurabad #CM KCR #Visit #Vasalamarri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు