కేసిఆర్ లో రేవంత్ భయం ? ఏ కీలక నిర్ణయం తీసుకున్నారంటే ?

వరుసగా తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ప్రభావం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఏది ఉండదు అని ఇప్పటి వరకు అంత అనుకున్నా, పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

 Telangana Cm Kcr Take Key Destion About Telangana Politics- Revanth Reddy, Telan-TeluguStop.com

అధికార పార్టీ టిఆర్ఎస్ కూడా బిజెపి, కాంగ్రెస్ లకు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.తెలంగాణలో నెలకొన్న అన్ని ప్రధాన సమస్యల పైన రేవంత్ దృష్టి పెడుతూ , ప్రభుత్వంపై పోరాటం చేస్తూ, ప్రజల్లో కాంగ్రెస్ బలం పెరిగేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న తీరు అధికార పార్టీలో కంగారు పుట్టిస్తోంది.

ఈ క్రమంలోనే రేవంత్ దూకుడు అడ్డుకోవడంతో పాటు, తెలంగాణలో ఏ విధంగా బలం పెంచుకుని మరోసారి అధికారంలోకి ఎలా రావాలి అనే విషయం పై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి పెట్టారు.

దీనిలో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పర్యటించేందుకు కేసీఆర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

వరుసగా రెండు నెలల పాటు పూర్తిగా జనంలోనే ఉంటూ టిఆర్ఎస్ బలం పెంచుకోవాలని చూస్తున్నారు.త్వరలోనే హుజురాబాద్ ఉప ఎన్నికలు ఉండడంతో, ఇప్పటి నుంచే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరో వైపు చూస్తే పెట్రోల్ , డీజిల్ గ్యాస్ ధరలు పెంపుదలకు నిరసనగా కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ నిరసన దీక్షలు చేపట్టడం, అవి ఆ పార్టీలో ఊపు తీసుకురావడం వంటి వ్యవహారాలు టిఆర్ఎస్ ను కలవర పెడుతున్నాయి.అలాగే తెలంగాణలో ప్రధాన సమస్యగా మారిపోయిన నిరుద్యోగ అంశంపైన రేవంత్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి మరి పోరాడేందుకు సిద్ధమవుతున్న తీరు తో అధికార పార్టీ కంగారు పడినట్టు కనిపిస్తోంది.

అందుకే ఎక్కడా రేవంత్ ప్రభావం కనిపించకుండా చేసేందుకు కెసిఆర్ జిల్లాల టూర్ లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Telugu Hujurabad, Kcr Tours, Pcc, Revanth Reddy, Telangana, Telangana Cm-Telugu

కేవలం కేసీఆర్ మాత్రమే కాకుండా, మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రజా సమస్యల పైన దృష్టి సారించి వాటి పరిష్కార మార్గాలు వెతకాలని, ఎక్కడా కాంగ్రెస్, బిజెపిలకు అవకాశం లేకుండా చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.టిఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం టిఆర్ఎస్వి భాగస్వామ్యంతో తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆదివారం నుంచి బస్సు యాత్ర నిర్వహించనుంది.అలాగే హుజూరాబాద్ నియోజకవర్గం లో 15 రోజుల పాటు బస్సు యాత్ర సాగనుంది.

ఈ యాత్రలో బిజెపి, కాంగ్రెస్ విధానాలపై న విమర్శలు చేస్తూ టిఆర్ఎస్ బలం పెరిగేలా చేసేందుకు వ్యూహ రచనలు చేశారు.ఇలా టిఆర్ఎస్ లో అన్ని సంఘాలను యాక్టివ్ చేసి తెలంగాణ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించే దిశగా కెసిఆర్ ప్లాన్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube