గేరు మార్చిన సారు ! ' కారు ' ఓవర్ స్పీడే ?

వందకు తగ్గకుండా గ్రేటర్ లో సీట్లను సంపాదించాలనే లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీకి అనుకోకుండా బీజేపీ గట్టి పోటీ ఇవ్వడం తో అంచనాలన్నీ తలకిందులయ్యాయి.అయితే మొదటి నుంచి గ్రేటర్ ఎన్నికలలో టిఆర్ఎస్ జెండా ఎగురుతుంది అని చెప్పిన కేసీఆర్ అనుకున్నట్లుగానే అన్ని పార్టీల కంటే కాస్త ఎక్కువ సీట్లను సంపాదించుకున్నారు.

 Telangana Cm Kcr New Political Skech Againist Bjp, Bjp,ghmc, Kcr, Ktr, Mla, Naga-TeluguStop.com

అయితే పేరుకు మెజారిటీ వచ్చినా రాబోయే విపత్తు తలుచుకుని టిఆర్ఎస్ శ్రేణులు కలవరపెడుతున్నాయి.ఎప్పుడూ లేని విధంగా బీజేపీ బలం పెంచుకోవడం ఆ పార్టీ నేతలు ఎవరికి మింగుడు పడడం లేదు.2016 ఎన్నికలలో టిఆర్ఎస్ 99 దక్కించుకుంటే,  ఇప్పుడు వచ్చిన ఫలితాలలో కేవలం 55 స్థానాలకు పరిమితం అయిపోయింది బీజేపీ 48 స్థానాలు దగ్గరగా వచ్చి చేరింది.దీంతో రానున్న రోజుల్లో బీజేపీతో ఎంతటి ప్రమాదం ఉందో కేసిఆర్ గుర్తించారు.

బిజెపి అగ్రనేతలను కలిసి తెలంగాణపై దూకుడు పెంచి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమే ఏకైక లక్ష్యంగా ముందుకు వెళుతుండటంతో కేసీఆర్ సైతం అదే రేంజ్ లో బిజెపికి గట్టి కౌంటర్ ఇవ్వాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు.అందుకే బిజెపి ని ఇబ్బంది పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ రాజకీయాల్లో వేలు పెడుతూ,  దేశవ్యాప్తంగా బీజేపీ పై వ్యతిరేకత పెంచే  అంశాలపై దృష్టి సారించారు.

ప్రస్తుతం వ్యవసాయ సంస్కరణలు బిల్లు విషయమై కేంద్రం ఇబ్బందులు ఎదుర్కొంటోంది.గత రెండు వారాలుగా ఢిల్లీలో పెద్దఎత్తున రైతులు కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణలు బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.

నిన్ననే భారత్ బంద్ కు పిలుపు ఇచ్చి సక్సెస్ చేశారు.దీనికి బీజేపీ వ్యతిరేక పార్టీలు మద్దతు పలికాయి.

తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం కు  ఇవ్వడమే కాకుండా టిఆర్ఎస్ శ్రేణులు పెద్ద రోడ్డు పైకి వచ్చి వ్యవసాయ సంస్కరణలు బిల్లుకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా ఆందోళనలు నిర్వహించారు.కేంద్రాన్ని ఇబ్బంది పెట్టే విధంగా విమర్శలు చేయడం ద్వారా, తెలంగాణలో బిజెపి నేతలు దూకుడుకు కళ్లెం వేయాలి అనే విధంగా కెసిఆర్ వ్యవహరిస్తున్నారు.

అలాగే గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి నిత్యం పార్టీ శ్రేణులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.గత ఆరేళ్లుగా ఎప్పుడూ పడని అంత కంగారు పడుతున్నారు.

వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.దీనికితోడు ఇటీవల  నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య ఆకస్మిక మరణంతో అక్కడ కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ,బీజేపీకి చాన్స్ ఇవ్వకుండా ఇప్పటినుంచి జాగ్రత్తపడుతూ పార్టీని ప్రభుత్వాన్ని యాక్టివ్ చేసినట్లు కనిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube