కేసీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ తిప్పికొట్టనుందా?

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తన జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితిని (బిఆర్ఎస్) విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నారు.

 Telangana Cm Kcr Nanded Meeting Details,cm Kcr,nanded Meeting,maharashtra,harish-TeluguStop.com

తెలంగాణ వెలుపల మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ సమావేశం మహారాష్ట్రలోని నాందేడ్ నగరంలో ఈరోజు జరుగుతోంది.ఈ సమావేశానికి ముందు నాందేడ్ అంతా గులాబీ హోర్డింగ్‌లు, కటౌట్‌లతో నిండిపోయింది.

నాందేడ్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న గురుగోవింద్ సింగ్ మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది.

నాందేడ్‌లో 40,000 మందికి పైగా తెలుగు ప్రజలు నివసిస్తున్నారు.

తెలంగాణతో సరిహద్దును పంచుకునే మహారాష్ట్రలోని జిల్లాలలో ఇది ఒకటి.తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండడంతో కేసీఆర్ ఈ భారీ సభకు నాందేడ్‌ను వేదికగా ఎంచుకున్నారు.

ఈ సమావేశానికి 25000 మందికి పైగా హాజరవ్వాలని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అనుకున్నాయి.

Telugu Brs, Cm Kcr, Harish Rao, Maharashtra, Nanded, Telugu-Telugu Political New

అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి లేదు కానీ కెసిఆర్ మాత్రం విపరీతంగా ఖర్చు పెట్టి ఈ భారీ సభను నిర్వహిస్తున్నాడు.మరోవైపు తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి బిజెపి ప్రతి చోట ముమ్మరంగా ఎన్నికల కసరత్తు ప్రారంభించేసింది.పక్క రాష్ట్రానికి వెళ్లి పంతులు వేల సంఖ్యలో ఇప్పటిదాకా ఉన్న ప్రాంతీయ పార్టీ అధినేతను చూసేందుకు జనాలు వస్తారనుకోవడం నిజంగా అతిశయోక్తి.

Telugu Brs, Cm Kcr, Harish Rao, Maharashtra, Nanded, Telugu-Telugu Political New

తెలంగాణ వెలుపల బీఆర్‌ఎస్‌ తొలి కార్యక్రమం కావడంతో రాజకీయ ప్రపంచం మొత్తం ఈ సమావేశంపై దృష్టి సారించింది.ఈ సమావేశంలో నాందేడ్ పరిసర ప్రాంతాల్లోని పలువురు సర్పంచ్‌లు, రాజకీయ నాయకులు బీఆర్‌ఎస్‌లో వచ్చారు.సభ ఏర్పాట్లను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్ రెడ్డి, బాల్క సుమన్, విట్టల్ రెడ్డి, షకీల్ దగ్గరుండి చూసుకగా… ఈ సమావేశానికి బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.అయితే జనం వద్దనుండి పెద్దగా రెస్పాన్స్ లేదు.

జాతీయ పార్టీ నడిపేందుకు కేసిఆర్ కు ఎంత దృఢ సంకల్పం ఉన్నప్పటికీ అందుకు కావాల్సిన అంత సమయం లేదనేది రాజకీయ విశ్లేషకులు అంచనా.

అయితే ఇప్పుడే గ్రౌండ్ సెట్ చేసుకొని ఆ తర్వాత వచ్చే ఎన్నికలకు భారీ లెవెల్ లో ప్లాన్ చేసుకుందాం అన్నది కేసీఆర్ ఆలోచన అలాంటప్పుడు హరీష్ రావు లేదా కేటీఆర్ లను తెలంగాణలో జరగాల్సిన పనులకు ప్రతినిధులుగా నిలిపే ప్రయత్నం కూడా గులాబీ బాస్ చేయడం లేదు.

మరి ఇంట దెబ్బతిని రచ్చనా ఓడిపోయే ప్రమాదం ఉందని కెసిఆర్ కు తెలియదా?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube