స్నేహమా శత్రుత్వమా ? తేల్చుకోలేకపోతున్న కేసీఆర్ ?  

Telangana Cm Kcr Krishna Water Issue - Telugu Ap Govt, Godavari Tmc, Krishna Water, Telangana Bjp, Telangana Cm Kcr, Trs Leaders

తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర సందిగ్దంలో ఉన్నారు.ఏ విధంగా ముందుకు వెళ్లాలో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నారు.

 Telangana Cm Kcr Krishna Water Issue

మొదటి నుంచి తన రాజకీయ సలహాలు తీసుకుంటూ ఏపీ సీఎం గా తిరుగులేని విజయాన్ని సాధించిన తన మిత్రుడు జగన్ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అని విషయంలో కేసీఆర్ తీవ్ర తర్జన భర్జన పడుతున్నారు.ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల అంశం తీవ్రతరం అయ్యింది.

ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గకుండా జీవో నెంబర్ 203 పాస్ చేసింది.దీనిపై తెలంగాణ లోని రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.

స్నేహమా శత్రుత్వమా తేల్చుకోలేకపోతున్న కేసీఆర్ -Political-Telugu Tollywood Photo Image

కానీ తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ పెద్దగా ఏపీ ప్రభుత్వం తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవాదంపైనా, సీరియస్ గా విమర్శలు చేయకపోవడం పైన తెలంగాణ లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.అయితే ఈ అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్తే రాజకీయంగా దెబ్బతింటామనే ఉద్దేశంతో కేసీఆర్ తో పాటు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఏపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.

అయితే ఆ విమర్శలు అంత తీవ్రతరంగా లేవన్నది ఇప్పుడు తెలంగాణ విపక్ష పార్టీల మాట.

ఇక ఈ విషయంలోనూ ఏపీ ప్రభుత్వం రాజకీయ విమర్శలు చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వకుండా, తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్ళి పోతుంది.ఇక ఈ వ్యవహారంపై ఇప్పటికే కేంద్రానికి, కృష్ణ బోర్డు కి కూడా తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.తెలంగాణ బిజెపి ఈ విషయంలో గట్టి పట్టుదలతో ఉంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.

దీనిపై తాజాగా స్పందించిన కేసీఆర్ ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉందని, సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను అంటూ దాటవేశారు.గోదావరిలో ఎక్కువ ఉన్న నీటిని రాయలసీమకు తీసుకోవాలని తామే చెప్పామని, విపక్షాల గురించి పట్టించుకోవద్దని, ప్రజలు కూడా ఇలాగే భావిస్తున్నారని, కేసీఆర్ చెప్పుకొచ్చారు.

రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న, గోదావరిలో ఇంకో వెయ్యి టీఎంసీలు ఉంటున్నాయని, వాటిని తీసుకుందామని తాను చెప్పినట్లు వివరించారు.అనవసరంగా సముద్రంలో కలిసిపోయే గోదావరి జలాలను రాయలసీమకు తరలించడంలో తప్పేమీ లేదని కేసీఆర్ అన్నారు.రెండు రాష్ట్రాలు సామరస్యపూర్వకంగా ఉంటేనే నదీ జలాలను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందని, గోదావరి విషయంలో మహారాష్ట్ర తో మాట్లాడి తాను సాధించానని కేసీఆర్ గుర్తు చేశారు.రాయలసీమకు గోదావరి జలాలను తీసుకోమని తానే చెప్పానని, కానీ అది వేరే రకంగా తీసుకుంటానంటే తాము ఎందుకు ఊరుకుంటాము అంటూ కేసీఆర్ చెప్పారు.

తెలంగాణ ప్రయోజనాలకు ఎవరు అడ్డంపడినా, ఊరుకునేది లేదని, ప్రతిపక్షాలు ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేస్తూ రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికీ కలిసే ఉన్నాయని, ఈ రెండు రాష్ట్రాల మధ్య ఎటువంటి విభేదాలు లేవని, ఏ సమస్యనైనా కలిసి సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామంటూ చెబుతున్నారు.

మొత్తంగా కెసిఆర్ వ్యవహారశైలి చూస్తుంటే జగన్ తో శత్రుత్వం పెట్టుకునేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు.అలా అని విమర్శలు చేయకుండా ఉంటే తెలంగాణలో రాజకీయంగా బలహీనమవుతామనే ఉద్దేశంలో సుతిమెత్తగా కేసీఆర్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు అనే విమర్శలు ఎక్కువయ్యాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు