కరోనా అప్డేట్: తెలంగాణ ను భయపెడుతున్న మహారాష్ట్ర ? కేసీఆర్ కీలక నిర్ణయం ?

తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా వైరస్ విషయంలో చాలా ధీమాగానే ఉన్నారు.త్వరలోనే తమ రాష్ట్రం నుంచి ఈ వైరస్ మహమ్మారిని తరిమికొడతాం అంటూ ధైర్యంగా ప్రకటిస్తున్నారు.

 Kcr Close The Telangana And Maharastra Borders, Telangana Cm Kcr, Kcr, Corona Vi-TeluguStop.com

ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా, పటిష్ట చర్యలు తీసుకున్నామని ఆయన ప్రకటించారు.ఇక ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనలు మరికొంత కాలం పొడిగిస్తే, అసలు కొత్త కేసులే నమోదు కావు అని చెప్పడమే కాకుండా, ఇంకా లాక్ డౌన్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం వెలువడక ముందే, తెలంగాణలో మరికొంతకాలం లాక్ డౌన్ ని పొడిగిస్తున్నాం అంటూ, కేసీఆర్ ప్రకటించారు.

ఇది ఇలా ఉండగా తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 530 కొరకు నమోదయ్యాయి.మరో రెండు మూడు రోజుల్లో వీటి సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది.

దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా దృష్టి పెట్టి ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలను తీసుకుంటోంది.అయితే ఇంతవరకు బాగానే ఉన్నా, తెలంగాణకు పక్కనే ఉన్న మహారాష్ట్రలో వీటి సంఖ్య రోజు రోజు కి పెరుగుతూ ఉండడం, అక్కడ కరోనా కేసులు రోజురోజుకు వందల సంఖ్యలో నమోదవుతూ ఉండడం తెలంగాణ వాసులను కంగారుపెడుతోంది.

ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దును ఆనుకుని మహారాష్ట్ర సరిహద్దులు పంచుకుని ఉండడంతో మరింత ఆందోళన తెలంగాణ ప్రజల్లో రేకెత్తిస్తోంది.దీంతో తెలంగాణ బార్డర్ నుంచి మహారాష్ట్ర లో ఉన్న అన్ని మార్గాలను మూసివేయాలని కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

అసలు మహారాష్ట్ర నుంచి అత్యవసర సరుకులు కూడా తమ రాష్ట్రంలోకి తీసుకు రావడం గానీ, పంపించడం గాని చేయకూడదని కెసిఆర్ భావిస్తున్నారట.ఇదే విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వంతో కూడా చెప్పడంతో అక్కడి నుంచి సానుకూల నిర్ణయం వెలువడుతుందని తెలుస్తోంది.

అలాగే పోలీసులు కూడా బార్డర్ అవతల నుంచి ఇవతలకు రాకపోకలు సాగించవద్దని కేసీఆర్ సూచనలు చేశారు.

Telugu Centralforce, Corona, Maharastra-Political

మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు ఏ ఒక్కరు రాకపోకలు సాగించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.అవసరమైతే ఆంధ్ర, మహారాష్ట్ర బోర్డర్ లో కేంద్ర బలగాలను మోహరించాలని కేసీఆర్ భావిస్తున్నారు.ఈ మేరకు కేంద్రానికి కేంద్ర బలగాల విషయంలో విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

ఈ విధంగా కఠినంగా నిర్ణయాలు అమలు చేసి తెలంగాణలో పాజిటివ్ కేసులు పెరగకుండా చూడాలని చూస్తున్నారు.మహారాష్ట్ర లో వస్తున్న ఈ వైరస్ ప్రభావం వల్ల తెలంగాణలోనూ కొత్త కేసులు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టుగా కేసీఆర్ ఆందోళనలో ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube