థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై కేసీఆర్ అడుగులు.. భేటీ వెనుక కారణం ఇదేనా?

దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగేందుకు ఇంకా రెండున్నర సంవత్సరాల గడువు మాత్రమే ఉందన్న విషయం తెలిసిందే.అయితే దేశ వ్యాప్తంగా బీజేపీపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని భావిస్తున్న ప్రతిపక్షాలు థర్డ్ ఫ్రంట్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

 Telangana Cm Kcr Focus On Third Front Meets Pinarayi Vijayan And Cpm Leaders In-TeluguStop.com

గత సార్వత్రిక ఎన్నికల్లోనే థర్డ్ ఫ్రంట్ పై కీలక వ్యాఖ్యలు చేసిన కెసీఆర్ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్ పై దూకుడుగా అడుగులు వేయనటువంటి పరిస్థితి ఉంది.అయితే తాజాగా మరోసారి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై కెసీఆర్ పూర్తిగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

తాజాగా కమ్యూనిస్ట్ నేతలతో కెసీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా దేశ రాజకీయ పరిస్థితులపై చాలా కూలంకుశంగా చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సందర్భంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై కమ్యూనిస్ట్ నేతలు కూడా సలహాలు, సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే ముఖ్యంగా దేశ వ్యాప్తంగా మోడీ నాయకత్వాన్ని వ్యతిరేకించే మమతా బెనర్జీ ఇంకా యూపీఏ పక్షాల నిర్ణయం తరువాత థర్డ్ ఫ్రంట్ పై ఒక ఖచ్చితమైన రూపు అనేది వస్తుంది.బీజేపీ కి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేయడం అంటే ఆశామాషీ వ్యవహారం కాదు.ప్రతి ఒక్క అడుగు ఆచితూచి వేయాల్సి ఉంటుంది.ఇటు తమ స్వంత రాష్ట్రంలో పార్టీని కాపాడుకుంటూ దేశ వ్యాప్తంగా పోరాడాల్సి ఉంటుంది.ఇంకా రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉండటంతో విపక్షాలు థర్డ్ ఫ్రంట్ లో భాగం కావడానికి ముందుకు వస్తాయా లేదా అనేది ఇప్పటికిప్పుడు క్లారిటీ రాకున్నా రానున్న కాలంలో మిగతా పార్టీలు ఆ దిశగా దృష్టి సారిస్తున్న తరుణంలో తప్పకుండా తమ పార్టీ అభిప్రాయాన్ని కూడా వెల్లడించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రతి ఒక్క పార్టీ తమ అభిప్రాయాన్ని తెలిపే అవకాశం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube