తడాఖా చూపించబోతున్న కేసీఆర్ ? భారీ బహిరంగ సభ ?

గతంతో పోలిస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా పట్టుదలతో ఉన్నారు.రాజకీయంగా ఎదురవుతున్న అన్ని ఇబ్బందులను అధిగమించి రాజకీయంగా మరింత యాక్టివ్ గా పార్టీ నేతలు ఉండేలా చేయాలని చూస్తున్నారు.

 Telangana Cm Kcr To Held Meeting On Nagarjuna Sagar Elections, Ghmc, Dubbaka, Mi-TeluguStop.com

ముఖ్యంగా దుబ్బాక , గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఇబ్బంది కలిగించడంతో , ఇప్పుడు ఆ ఇబ్బందులను అధిగమించేందుకు కెసిఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు.ఇప్పటికే పార్టీపరంగా ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రి కేటీఆర్ చక్క పెడుతున్నారు.

ఎక్కడా అసంతృప్తులు, గ్రూపు రాజకీయాలు లేకుండా అన్ని వ్యవహారాలను చక్కబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.త్వరలోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడ ఖచ్చితంగా గెలిచి తీరాలని, ఆ స్థానాన్ని మళ్లీ దక్కించుకోవాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు.

దీనిలో భాగంగానే ఈనెల 22 , 23 తేదీల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Telugu Congress, Dubbaka, Ghmc, Ktr, Nagarjuna Sagar, Telangana, Telanganacm, Tr

ఆ బహిరంగ సభ లో కెసిఆర్ పాల్గొని పార్టీ నాయకుల్లో ఉత్సాహంగా తీసుకొచ్చే విధంగా చేయడంతో పాటు, ప్రజలలోనూ టిఆర్ఎస్ కు ఆదరణ పెరిగి స్థాయిలో ప్రసంగం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.కొద్ది నెలల క్రితం జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా ఆ నియోజకవర్గంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారనే హడావుడి నడిచినా, చివరి నిమిషంలో ఆ సభను  వాయిదా వేసుకున్నారు.అక్కడ సభ నిర్వహించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని లెక్కలు ఇప్పుడు టిఆర్ఎస్ వేసుకోవడంతో నాగార్జునసాగర్ లో ముందుగానే బహిరంగ సభ నిర్వహించి ప్రజలు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచాలని టిఆర్ఎస్ డిసైడ్ అయింది . ఫిబ్రవరి లేదా మార్చి లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందు నుంచి అన్ని వ్యవహారాలను జాగ్రత్త చక్కబెట్టాలని కెసిఆర్ పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు.ఈ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటిని వేగంగా చేసుకు వస్తున్నారు.

ఈ మేరకు కేసీఆర్ నిర్వహించిన భారీ బహిరంగ సభ అన్ని విధాలుగా కలిసి వస్తుందని టిఆర్ఎస్ శ్రేణులు నమ్మకం పెట్టుకున్నాయి .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube