తిట్టినా మొట్టినా ఇంతేనా ? కేసీఆర్ కు ఏమైంది ?

టీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు.తాను ఏం చేసినా, ఎటువంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నా, ఎన్ని చేసినా అంతిమంగా తెలంగాణ ప్రజల లబ్ధి కోసమే అనే విషయాన్ని కేసీఆర్ హైలెట్ చేస్తూ, రాష్ట్రంలో తనపై ఎక్కడైనా వ్యతిరేకత వస్తే, దానిని చల్లార్చడం లోనూ కెసిఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటారు.

 Growing Discretion Of The People Over The Kcr Administration, Telangana Cm Kcr,-TeluguStop.com

ఆ తరహా వ్యవహారశైలి కారణంగానే టిఆర్ఎస్ పార్టీని స్థాపించిన కొద్ది కాలంలోనే తన జీవిత ఆశ్రయమైన ప్రత్యేక తెలంగాణను ఆయన సాధించుకోగలిగారు.రెండుసార్లు అధికారంలోకి రాగలిగారు.

మొదటి విడత అధికారంలోకి వచ్చినప్పుడు పూర్తిగా ప్రజా సంక్షేమ పథకాలు అమలు విషయంపైనే దృష్టి పెట్టి తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళినా, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ వ్యవహారశైలిపై అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి.

కాకపోతే కేసీఆర్ ను ఢీ కొట్టగల బలమైన రాజకీయ ప్రత్యర్ధులు లేకపోవడంతో, టీఆర్ఎస్ ఎదురులేకుండా ఉంది.ఇదే కేసీఆర్ కు కలిసొస్తోంది.

కానీ కేసీఆర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయనకు చిక్కులు తెచ్చి పెడుతున్నాయి.ఏదైనా విషయంలో కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడరు.

ఇదే ప్రజల్లో ఆగ్రహం కలిగిస్తోంది.మొండితనంతో వ్యవహరిస్తున్నట్టుగా ఆయన వ్యవహారం ఉండటం కారణంగా, ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కువగా విమర్శలపాలవుతున్నారు.

Telugu Kcr, Kcrtelangana, Secretariat, Revanth Reddy, Trs-Telugu Political News

కరోనా వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి కేసీఆర్ గతంలో ఎప్పుడూ లేని విధంగా అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు.కరోనా పాజిటివ్ సోకిన వారి లెక్కలు బయటకి ప్రకటించే విషయంలో కానీ, వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యల్లో కానీ, వారికి వైద్య సదుపాయాలు అందించడంలో కానీ, ఇలా అన్ని విషయాల్లోనూ ఆయన విమర్శలు ఎదుర్కుంటున్నారు.కోర్టులు సైతం ఇదే విషయాన్ని తప్పు పడుతూ వస్తున్నాయి.అలాగే సచివాలయం కూల్చివేత విషయంలోనూ ఎన్నో విమర్శలు కేసీఆర్ ఎదుర్కొన్నారు.కనీసం ఆ కూల్చివేత  ప్రదేశానికి మీడియాను సైతం అనుమతించకపోవడంపై అనేక అనుమానాలు, విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఇదే విషయం హైకోర్టు వరకు వెళ్ళింది.

సచివాలయం కూల్చివేత వద్దకు మీడియా ఎందుకు అనుమతించడం లేదు అనే విషయంపై కోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవడం వంటివి కోర్టుకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.ఒకటి కాదు రెండు కాదు అనేక విషయాల్లో కేసీఆర్ నిర్ణయాలపై విమర్శలు పెరుగుతూనే వస్తున్నాయి.

అయినా ఆయన వ్యవహార శైలి మాత్రం మార్చుకునేందుకు ఇష్టపడడం లేదు.ఈ మధ్యకాలంలో కోర్టుల్లో ఎక్కువగా చివాట్లు తినే పరిస్థితి వస్తుండడంతో, ప్రజల్లో టిఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది.

ఏదో ఒక రూపంలో కేసీఆర్ వివాదాస్పదం అవుతూనే వస్తున్నారు.

ఇదే సమయంలో బిజెపి బాగా బలపడేందుకు ప్రయత్నిస్తుండడం, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి వంటివారు దూకుడుగా ముందుకు వెళ్తున్న తీరు టీఆర్ఎస్ కు దడ పుట్టిస్తున్నాయి.

రాజకీయంగా పరిస్థితి అంతా అనుకూలంగా లేని సమయంలో, కేసీఆర్ ఈ స్థాయిలో దూకుడు ప్రదర్శిస్తూ మొండి పట్టుదలతో ముందుకు వెళ్తున్న విధానం పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube